Nara Rohith: ఓ ఇంటివాడు కాబోతున్న నారా రోహిత్.. నిశ్చితార్థం, పెళ్లి వివరాలివే!

Ad not loaded.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో నారా రోహిత్ (Nara Rohith) ఒకరు కాగా విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ హీరోకు మాస్ సినిమాలతో మాత్రం విజయాలు దక్కలేదు. నారా రోహిత్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ నెల 13వ తేదీన నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. ప్రతినిధి2  (Prathinidhi 2) హీరోయిన్ సిరి లేళ్లను రోహిత్ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. నారా రోహిత్ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Nara Rohith

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు కావడంతో నారా రోహిత్ కు తెలుగు రాష్ట్రాల్లో బాగానే క్రేజ్ ఉంది. తన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే ఫ్లాప్ అని ఒపుకునే అతికొద్ది మంది హీరోలలో నారా రోహిత్ ఒకరు. ఈ నెలలోనే నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నారా రోహిత్ వయస్సు ప్రస్తుతం 40 సంవత్సరాలు కాగా ఈ హీరో ఓ ఇంటివాడు అవుతుండటం అభిమానులకు ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది.

నారా రోహిత్ యాక్టింగ్ స్కిల్స్ తో సైతం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. భవిష్యత్తు సినిమాలతో ఈ హీరోకు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నారా రోహిత్ అన్న పేరు నారా శిరీష్ కాగా శిరీష్ కు ఇంకా పెళ్లి కాలేదని సమాచారం. నారా రోహిత్ పెళ్లి తర్వాత కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు హీరోగా తన రేంజ్ ను పెంచుకోవాలని భావిస్తున్నారు.

నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకకు చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు బాలయ్య (Nandamuri Balakrishna) సైతం హాజరు కానున్నారు. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరగనుంది. నారా రోహిత్, సిరి లేళ్ల జోడీ చూడముచ్చటగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

‘దేవర’ 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus