నితిన్ సినిమాతోనే నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడట..!

  • June 1, 2020 / 11:26 AM IST

ఇప్పడు డిఫరెంట్ సబ్జెక్టు లు ఎంచుకుంటూ.. హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు మన యంగ్ హీరో నిఖిల్. గతేడాది ‘అర్జున్ సురవరం’ చిత్రంతో హిట్ అందుకున్న నిఖిల్.. ఈ ఏడాది లాక్ డౌన్ టైం లో పల్లవి వర్మను పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడైన సంగతి తెలిసిందే. ‘హ్యాపీ డేస్’ చిత్రంతో వచ్చిన ఫాలోయింగ్ ను ఉపయోగించుకుని ఇప్పటికీ రాణిస్తున్న నటులు ఎవరైనా ఉన్నారా అంటే.. ఒకరు తమన్నా మరొకరు నిఖిల్ అనే చెప్పాలి.

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘హ్యాపీ డేస్’ చిత్రంలో నిఖిల్ పోషించిన రాజేష్ పాత్ర యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అందరూ.. అదే నిఖిల్ మొదటి సినిమా అని అనుకున్నారు. కానీ అంతకు ముందే నిఖిల్ ఓ క్రేజీ హీరో చిత్రంలో నటించాడు. ఆ క్రేజీ హీరో ఎవరు.. ఆ సినిమా ఏంటి అనేగా మీ డౌట్.? అసలు విషయం ఏంటంటే.. నితిన్ హీరోగా ‘సంతోషం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ చిత్రాలు అందించిన దర్శకుడు దశరథ్.. ‘సంబరం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

సంచలన దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇదే నిఖిల్ కు మొదటి చిత్రం. ఓ సన్నివేశంలో ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోయే పాత్రలో నిఖిల్ కనిపించాడు. క్రింద మీరు చూస్తున్న ఫోటో ఆ చిత్రంలోనిదే. ఈరోజు నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక పెళ్ళైన తరువాత నిఖిల్ కు ఇదే మొదటి పుట్టినరోజు కావడం మరో విశేషం.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus