యంగ్ హీరో నిఖిల్ గతేడాది ‘అర్జున్ సురవరం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఆలస్యంగా విడుదల అయినప్పటికీ ఆ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న నిఖిల్.. మళ్ళీ ఇప్పుడు సినిమాలతో బిజీ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్లో ‘కార్తికేయ2’ చిత్రంతో పాటు ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు నిఖిల్.
’18 పేజెస్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ మెమొరీ లాస్ పేషెంట్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ‘కార్తీకేయ2′ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ’18 పేజెస్’ లో కూడా అనుపమ పరమేశ్వరన్ నే హీరోయిన్ గా ఎంపికచేసుకోవాలని దర్శకనిర్మాతలను కోరాడట నిఖిల్.
దాంతో ఆమెనే ఫిక్స్ చేసే పనిలో దర్శకనిర్మాతలు ఉన్నట్టు సమాచారం. చెప్పాలంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో ఏ సినిమాలోనూ నటించడం లేదు. గతేడాది అనుపమ నటించిన ‘రాక్షసుడు’ చిత్రం హిట్ అయినప్పటికీ మళ్ళీ మరో సినిమాలో నటించలేదు అనుపమ. ఇప్పుడు ఈ ట్యాలెంటెడ్ హీరోయిన్ వరుసగా రెండు సినిమాల్లో నటిస్తుంది అంటే.. ఈమె ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.