Nithiin: నితిన్ చేతికి గాయాలు.. షూటింగ్ క్యాన్సిల్ చేసిన మేకర్స్!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. ఈయన హీరోగా ఇటీవల ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా పనులలో బిజీగా ఉండగా వెంకీ కుడుముల డైరెక్షన్లో కూడా మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈయన వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలు ఉండడంతో మేకర్స్ ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సన్నీ వేషాలను షూట్ చేసే సమయంలో నితిన్ ప్రమాదంలో పడ్డారని తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో భాగంగా ఈయన చేతికి గాయాలు కావడంతో వెంటనే షూటింగుకు బ్రేక్ ఇచ్చి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా నితిన్ చేతికి గాయాలు కావడంతో ఆయనని పరీక్షించినటువంటి వైద్యులు సుమారు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవడం ఎంతో అవసరమని సూచించినట్లు తెలుస్తుంది. ఇలా నితిన్ ప్రమాదానికి గురైనటువంటి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కానీ ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి అలాగే నితిన్ (Nithiin) నుంచి కూడా ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్టర్ కాగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్కా తమ్ముడు మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus