Raj Tarun : ‘స్టాండప్ రాహుల్’ గురించి రాజ్ తరుణ్ స్పెషల్ ఇంటర్వ్యూ..!

  • July 12, 2021 / 04:39 PM IST

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్. త్వరలోనే ‘స్టాండప్ రాహుల్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభించింది. యూట్యూబ్ లో ఈ టీజర్ ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. ఇక ఈ చిత్రం గురించి హీరో రాజ్ తరుణ్ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.

ప్ర : హాయ్ రాజ్ తరుణ్ గారు.. ముందుగా కంగ్రాట్స్ మీ ‘స్టాండప్ రాహుల్’ టీజర్ కు మంచి స్పందన లభిస్తున్నందుకు.

జ : హాయ్ అంది.. థాంక్యూ సో మచ్.!

ప్ర : ఈ సినిమాలో మీరు ఓ స్టాండప్ కమెడియన్ గా చేశారు. దీని గురించి చెప్పండి.

జ : నాకు స్టాండప్ కామెడీ అంటే చాలా చాలా ఇష్టం. స్టాండప్ కామెడీ షోలకి నేను పెద్ద అభిమానిని. ఈ షోలు చూడడం కోసం నేను ముంబై కూడా వెళ్ళొచ్చేవాడిని. అదృష్టం కొద్దీ ఈ సినిమాలో నాకు అలాంటి పాత్ర దొరకడం పట్ల ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత నేను హైదరాబాద్ కు చెందిన స్టాండప్ కమెడియన్స్ తో కలిసి ఈ పాత్ర కోసం వర్క్ చేశాను. ఆ కామెడీ టైమింగ్ కోసం. నాకు ఇది చాలా ఉపయోగపడింది.

ప్ర : ఈ సినిమాలో ప్రేమ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కు స్కోప్ ఉంటుందా?

జ : నిజానికి ఇది ఓ రాంకామ్ ఎంటర్టైనర్.మంచి లవ్ స్టోరీ ఉంటుంది అలాగే సినిమాలో ఒక తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా కూడా. ‘స్టాండప్ రాహుల్’ అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. కచ్చితంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.

ప్ర : దర్శకుడు శాంటో మోహన్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?

జ : శాంటో మోహన్ గారి లాంటి దర్శకుడితో వర్క్ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. కథకి తగ్గట్టు పాత్రల్ని తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. శాంటో గారితో నాకు మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని ఉంది.

ప్ర : సీనియర్ నటి ఇంద్రజ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?

జ : ఇంద్రజ గారు ఈ చిత్రంలో తల్లి పాత్రలో కనిపిస్తారు. వెరీ స్వీట్ పర్సన్. ఈమెతో వర్క్ చేయడం నాకు మంచి అనుభూతిని కలిగించింది.

ప్ర : హీరోయిన్ వర్ష బొల్లమతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

జ : ఈమె చాలా మంచి నటి అలాగే ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఆమె నన్ను ప్రోత్సహించిన విధానాన్ని నేను మర్చిపోలేను. ఆమెతో వర్క్ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది.

ప్ర : ఈ చిత్రం థియేటర్లకు ఎప్పుడొస్తుందని మేము ఆశించ వచ్చు..!

జ : ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కచ్చితంగా మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం. అయితే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ వంటివి లేకుండా ఉంటే త్వరలోనే థియేటర్లకు వస్తాం.

ప్ర : ఈ సినిమాలో మీ మేకోవర్ కొత్తగా ఉంది.. కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేసినట్టున్నారు?

జ : ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ శాంటోకే చెందుతుంది. నన్ను కొత్తగా చూపించాలని ముందు నుండీ చెబుతున్నాడు. హెయిర్ స్టైల్ మాత్రమే కాదు.. నా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అతను చాలా శ్రద్ద పెట్టి.. కొత్తగా ఉండేలా చూసుకున్నాడు. ఇక నా హెయిర్ స్టయిల్ కి స్టోరీకి కూడా సంబంధం ఉంటుంది. అది మీరు సినిమా చూసాక తెలుస్తుంది.

ప్ర : మీ ‘పవర్ ప్లే’ మూవీ ప్లాప్ అవ్వడానికి కారణాలు ఏంటనుకుంటున్నారు?

జ : అది నా రెగ్యులర్ మూవీస్ లా ఉండదు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ఉండవు. సీరియస్ గా సాగే ఓ థ్రిల్లర్ అది. ‘పవర్ ప్లే’ రాంగ్ టైములో రిలీజ్ అయ్యింది అనుకుంటున్నాను. అదే మూవీని ఓటిటిలో రిలీజ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో..!

ప్ర : కొన్నేళ్లుగా మీ సినిమాలు బాగా ఆడడం లేదు… స్క్రిప్ట్ సెలక్షన్లో లోపమని మీరు భావిస్తున్నారా?

జ : అందుకు చాలా కారణాలు ఉంటాయని నేను అనుకుంటాను. అందులో మీరన్నట్టు రాంగ్ ఛాయిస్ కూడా అయ్యుండొచ్చు. అయితే ఫెయిల్యూర్స్ వల్ల చాలా లెసెన్స్ నేర్చుకోవచ్చని నేను భావిస్తాను.

ప్ర : మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

జ : ‘స్టాండప్ రాహుల్’ కాకుండా అన్నపూర్ణ స్టూడిస్ బ్యానర్లో ఓ మూవీ చేస్తున్నాను. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘డ్రీం గర్ల్’ కు రీమేక్ అది. త్వరలోనే షూటింగ్ స్టార్ అవ్వుద్ది. మరికొన్ని ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus