‘కాఫీ’ హీరో ఎందుకు అంత హర్ట్‌ అయ్యాడు?

  • December 10, 2020 / 11:39 AM IST

‘కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చేవారికి మీరేం సలహా ఇస్తారు’ అని హీరోనో లేక మాజీ హీరోనో అడిగితే… ‘కష్టపడండి… తప్పకుండా అవకాశాలొస్తాయి.. నిరూపించుకోండి’ అని అంటారు. కానీ ‘మంచి కాఫీలాంటి సినిమా’ చేసిన హీరో ఏకంగా ‘ప్లీజ్‌.. ఇండస్ట్రీకి రావొద్దు’ అని అంటున్నాడు. ఇంతకీ ఎవరా హీరో, ఎందుకు అలా అన్నాడో చూడండి. లవర్‌బాయ్‌గా ఓ వెలుగువెలిగి ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైన హీరోల్లో రాజా ఒకరు. ప్రస్తుతం పాస్టర్‌గా కొనసాగుతున్న రాజా… ఓ టీవీ షోలో పాల్గొన్నాడు.

అందులో ఇండస్ట్రీలో ఎంట్రీ గురించి, ఎగ్జిట్‌ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. అందులో రాజా చెప్పిన మాటలు అందరినీ షాక్‌లో నెట్టేశాయి. ‘పరిశ్రమకు వచ్చేవారికి ఏం సజెషన్‌ ఇస్తావ్‌’ అంటూ షో హోస్ట్‌ అడగగా…. ‘ఎవరినీ ఇటువైపు రావొద్దని చెబుతా’ అని సమాధానమిచ్చాడు రాజా. దీంతో రాజా మాటలపై చర్చ మొదలైంది. ‘ఓ చినదాన’తో మొదలైన రాజా ప్రస్థానం తొలినాళ్లలో బాగానే సాగింది. సుమారు 30 సినిమాల్లో నటించాడు.

అయితే రాజాకు బ్రేక్‌ ఇచ్చింది మాత్రం ‘ఆనంద్‌ – మంచి కాఫీ లాంటి సినిమా’. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. ‘ఆ నలుగురు’, ‘వెన్నెల’, ‘స్టైల్‌’ మినహా మిగిలిన సినిమాలు హీరోగా నిలదొక్కుకునేంత విజయం అందిచలేదు. దీంతో పరిశ్రమకు దూరమైపోయాడు. దానికి కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఏకంగా ఎవరూ సినిమాల్లోకి రావొద్దు అనేంత కష్టం రాజాకు ఏమొచ్చింది, ఏమైనా సినిమా అవకాశాలు ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారా? లేక ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus