Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు! : రాజశేఖర్

‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు! : రాజశేఖర్

  • July 2, 2019 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు! : రాజశేఖర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 28న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తో ఇంటర్వ్యూ…

సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది?

rajasekhar-special-interview-about-kalki-movie1

నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్… అన్ని బాగున్నాయని అంటున్నారు.

మీ సినిమాలలో మీ క్యారెక్టర్ డామినేటింగ్ గా ఉంటుంది. ఇందులో అండర్ ప్లే చేసినట్టున్నారు?

rajasekhar-special-interview-about-kalki-movie2

క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే… ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు. ‘సార్… ఇప్పుడే రెండోసారి సినిమా చూసాం మళ్లీ వెళుతున్నాం‌’, సార్… ‌ ఫ్యామిలీతో కలిసి మళ్లీ సినిమాకి వెళ్తున్నాం’ అని ఫోనులు చేస్తుంటే… నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది.

సినిమాలో మీ స్టైలింగ్ మీద చాలా కాన్సంట్రేట్ చేసినట్టున్నారు?

rajasekhar-special-interview-about-kalki-movie3

పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్తే చాలు… నేను డైటింగ్ చేయడం, వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫిట్‌నెస్ మీద దృష్టి పెడతా. ఇన్‌ష‌ర్ట్‌ చేసుకుంటే పొట్ట కనిపించకూడదు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ కావడంతో కాస్త ముందు నుంచి జాగ్రత్త పడ్డాను.

సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం?

rajasekhar-special-interview-about-kalki-movie4

నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా.

‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్‌ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరించినప్పుడు మీరు ఏమన్నారు?

rajasekhar-special-interview-about-kalki-movie6

సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమా చూసి మీ పిల్లలు ఏమన్నారు?

rajasekhar-special-interview-about-kalki-movie5

వాళ్లకు సినిమా బాగా నచ్చింది. పిల్లలు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంతే కాదు, వాళ్ల స్నేహితులు సినిమా చూసి… ‘మీ నాన్నగారు యంగ్ హీరోలకు ధీటుగా ఫైట్స్ చేశారు’ అని చెప్పారట. దాంతో మరింత సంతోషపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ లవ్ ట్రాక్‌ను కూడా చాలా బాగా డీల్ చేశారు. మీరు చూస్తే అందులో ఎక్కడా హీరో హీరోయిన్ మధ్య టచింగ్స్ ఉండవు. అదా శర్మతో నా పెయిర్ సూపర్ ఉందని మా అమ్మాయిలు చెప్పారు.

రాహుల్ రామకృష్ణ కోణంలో కథను చెప్పారు. ఎందుకలా?

rajasekhar-special-interview-about-kalki-movie7

స్క్రీన్‌ప్లేలో అదొక స్టైల్‌. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తే రొటీన్ అవుతుందని ఇలా ప్రయత్నించాం. రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం వల్ల క్లైమాక్స్‌కు అంత పేరు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు అలా చెప్పడం వల్ల థ్రిల్ ఫీలవుతున్నారు.

మీరు, బాలకృష్ణగారు కలిసి సినిమా చేస్తారనే వార్త వినిపిస్తోంది!

rajasekhar-special-interview-about-kalki-movie8

చాలా వినిపిస్తున్నాయి. చిరంజీవిగారు, నేను చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. (నవ్వులు)

విల‌న్‌గా చేయ‌డానికి సిద్ధ‌మేనా?

rajasekhar-special-interview-about-kalki-movie9

నేను రెడీ. (నవ్వుతూ) నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు… ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘శ్రీమంతుడు’ చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా.

‘దొరసాని’తో శివాత్మిక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తండ్రి, కుమార్తె కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా?

rajasekhar-special-interview-about-kalki-movie10

ఉంది. అయితే… ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి, ‘దొరసాని’ కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్ కి చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది. నిన్న విడుదలైన ‘దొరసాని’ ట్రైలర్ చూసి సావిత్రిగారితో కొందరు పోలుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.

మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా?

rajasekhar-special-interview-about-kalki-movie11

ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్ సత్తారు గారు ‘గరుడవేగ 2’ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #Hero Rajasekhar
  • #Jeevitha Rajasekhar
  • #Kalki Movie
  • #Prasanth Varma

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version