Rajashekhar: హీరో రాజశేఖర్ ఏం చేస్తున్నారు?

సీనియర్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ (Rajasekhar)  ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ విజయాలను పొందలేక పోతున్నారు. కెరీర్ ప్రారంభంలో అందించిన సూపర్ హిట్ సినిమాలు, పవర్ ఫుల్ క్యారెక్టర్లు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాయి. కానీ గత దశాబ్ద కాలంగా ఆయన చేసిన చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఫలితంగా ఆయన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినా, అది పెద్దగా సక్సెస్ కాలేదు.

Rajashekhar

ఇటీవల నితిన్ (Nithin Kumar) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన రాజశేఖర్‌కు (Rajashekhar) ఆ పాత్ర ఫెయిల్ కావడం బాధను కలిగించింది. ఆ సినిమా పరాజయం వల్లే కాదు, పాత్రపై వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్ ఆయనను ఆలోచనలో పడేసినట్టు తెలుస్తోంది. గత పదేళ్లలో చేసిన సినిమాల్లో ఒక్కటీ హిట్ ఇవ్వకపోవడంతో నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్ దారుణ స్థితిలో ఉన్నాయన్న వాస్తవం మరింత కష్టంగా మారింది.

ఇలాంటి సమయంలో రాజశేఖర్ ఇప్పుడు తమిళ్ హిట్ మూవీ లబ్బర్ పందును రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమా రైట్స్‌ను ఆయన స్వయంగా పొందినట్టు టాక్. ఈ కథలో క్రికెట్ నేపథ్యంలో నడిచే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. పెళ్లికి సిద్ధమైన కూతురు, క్రికెట్‌ను ప్రేమించే తండ్రి, కూతురి ప్రేమికుడి కోణంలో ఓ సానుకూల కథగా ఉంటుంది. తమిళనాట మంచి హిట్ సాధించిన ఈ కథను తెలుగు నేటివిటీకి అనువదించడం అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు.

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో చూసినవారు కూడా ఉండటంతో, దీనికి విభిన్నమైన ట్రీట్‌మెంట్ అవసరం. కథలో మార్పులు చేయకుంటే ఇది తెలుగులో వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయినా సరే, రాజశేఖర్ తాను మళ్లీ కెరీర్‌లో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఈ ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus