Ram, Gautham Menon: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ మూవీ ఫిక్సట..!

గౌతమ్ మీన‌న్ జోరు ఈ మధ్య కాస్త తగ్గింది. ముఖ్యంగా తెలుగులో ఈయన నుండి స్ట్రైట్ మూవీ వచ్చి చాలా కాలం అయ్యింది. 2016 లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం తర్వాత ఈయన కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే నటుడిగా మాత్రం అప్పుడప్పుడు మెరుస్తూనే ఉన్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ ‘కనులు కనులను దోచాయంటే’ ఈ రెండు సినిమాల్లో ఆయన నటించారు. ఇదిలా ఉండగా.. ప్రేమ కథా చిత్రాలకి అలాగే పోలీస్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ చిత్రాలకి ఈయన కేరాఫ్ అడ్రెస్.

ఒకసారి ఆ జోనర్ మరోసారి ఈ జోనర్ అన్నట్టు సినిమాలు చేస్తుంటారు.యాక్ష‌న్ సినిమాలు తీసేప్పుడు కూడా ఈయన చిన్న లవ్ స్టోరీని టచ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. ఈయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని చాలా మంది యంగ్ హీరోలు పరితపిస్తుంటారు. ఈ లిస్ట్ లో రామ్ కూడా ఉన్నాడు. గతంలో రామ్ – గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ అనే సినిమా రూపొందాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రామ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

దీంతో నానితో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశాడు గౌతమ్. అయితే త్వరలోనే రామ్ – గౌతమ్ మీనన్ కాంబోలో మూవీ సెట్ కానుందట. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. అన్నీ ఓకే అనుకుంటే ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. రామ్ ఈమ‌ధ్య త‌మిళ మార్కెట్ పై కన్నేశాడు.

లింగుస్వామి దర్శకత్వంలో.. ‘వారియ‌ర్‌’ చేస్తుంది కూడా అందుకే.! అది బై లింగ్యువల్ మూవీగా రూపొందుతుంది. ఇప్పుడు గౌత‌మ్ మీన‌న్ తో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది కూడా ద్విభాషా చిత్రమే. అయితే ఇది బోయ‌పాటి శ్రీ‌ను- రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ కంప్లీట్ అయ్యాక ఉంటుంది అని వినికిడి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus