లింగుస్వామిని నమ్ముకున్న ఎనర్జిటిక్ స్టార్..!

ఇస్మార్ట్ శంకర్ తో అలరించి,, రెడ్ సినిమాతో మరిపించి వెంటనే లింగుస్వామితో సినిమాకి కమిట్ అయ్యాడు హీరో రామ్ పోతినేను. అయితే, సడెన్ గా తమిళ డైరెక్టర్ ని ఎందుకు లైన్లో పెట్టాడు ? అంతగా సినిమాకి కమిట్ అయ్యే కథేం దొరికింది అనేది ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మూడేళ్ల క్రితం బన్నీతో లింగుస్వామి సినిమా చేయాల్సి ఉంది. అప్పుడు కథ కూడా ఫైనల్ చేస్కున్నారు. అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ ఇవ్వడమే లేట్ అన్నప్పుడు సడన్ గా బన్నీ సీన్ లోకి వక్కంతం వంశీని తీస్కుని వచ్చాడు.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాని లైన్లో పెట్టాడు. ఆ సినిమా బాక్సీఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. అయితే, ఇప్పుడు బన్నీ అప్పట్లో చర్చించిన సినిమానే ఇప్పుడు రామ్ ఓకే చేశాడా అనేది ఫిలింనగర్ లో చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే, తెలుగు హీరోలు అందరూ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ కథలవైపు మొగ్గుచూపుతున్నారు. సూపర్ స్టార్స్ గా నేషనల్ స్టార్స్ గా ఎదగాలని చూస్తున్నారు. వేరే భాషల్లో కూడా మార్కెట్ ని పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారు. అందులో రామ్ కూడా ఒకరు. ఇప్పుడు రామ్ లింగుస్వామితో చేయబోయే సినిమాతో తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

ఈ సినిమా రెండు భాషల్లో చిత్రీకరిస్తే రామ్ కి మంచి ఊరట కలిగినట్లే. బన్నీ తో వర్కౌట్ కాకపోయినా ఇప్పుడు లింగుస్వామికి మంచి మాస్ హీరో దొరికేశాడనే అంటున్నారు. అప్పుడు పెండింగ్‌ లో పడిపోయిన ఆ కథని ఇప్పుడు రామ్‌ చేస్తున్నాడని సినీనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితులకు అనుగునంగా కథలో చాలా మార్పులు చేయడంతోనే రామ్‌ ఈ స్క్రిప్ట్‌ ని ఓకే చేశాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా కృతిశెట్టిని తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి రామ్ మంచి నిర్ణయమే తీస్కున్నాడని చెప్తున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus