అప్పుడు విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రామ్..!

‘ఆర్‌.ఎక్స్‌100’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ చిత్రం తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో అజయ్ ఓ చిత్రం రూపొందిస్తున్నట్టు గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన కథ కూడా ఫైనలైజ్ అయిపోయిందని.. ఇక సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం అని అందరు అనుకున్నారు. కానీ రామ్ స‌డ‌న్‌గా ఆ సినిమాని ప‌క్క‌న పెట్టి పూరితో `ఇస్మార్ట్ శంక‌ర్‌` చేస్తున్నాడు.

అసలు రామ్ – అజ‌య్ భూప‌తికి మ‌ధ్య ఏం జరిగింది అని అంతా అనుకున్నారు. తాజా ఈ విషయం పై ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లుకొడుతుంది. విషయంలోకి వెళితే అజ‌య్ భూప‌తి చెప్పిన క‌థ‌.. రామ్‌ కి నచ్చిందట. అయితే కొన్ని మార్పులు చేయమని కోరాడట. ఈ విషయం పై చాలా రోజులు డిస్కషన్లు నడిచాయంట. అసలే రాంగోపాల్ వర్మ శిష్యుడు కాబట్టి అజ‌య్ భూపతి కాంప్రమైజ్ అవ్వలేదట. దీంతో ఇద్దరికీ మనస్పర్థలు చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో రామ్ త‌న నెక్స్ట్ సినిమాని పూరితో అనౌన్స్ చేయగా .. అదే క‌థ‌ని బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ఓకే చేయించేశాడట అజ‌య్ భూప‌తి.

అలా రామ్ వ‌దులుకున్న క‌థ‌.. బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు చేరిందన్నమాట. గతంలో ‘ఆర్‌.ఎక్స్‌100’ చిత్రం విషయంలో కూడా అజయ్ భూపతికి ఇలాగే జరిగిందట. మొదట ‘ఆర్‌.ఎక్స్‌100’ చిత్ర కథని విజయ్ దేవరకొండకి చెప్పాడట.. ఆ టైములో కూడా విజయ్ కొన్ని మార్పులు చెప్పగా.. అజయ్ దీనికి అంగీకరించకపోవడంతో కార్తికేయ తో తెరకెక్కించాడు. ఇప్పుడు రామ్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus