‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రాలతో ఫామ్లోకి వచ్చిన రామ్.. తరువాత ‘రెడ్’ అనే చిత్రంలో కూడా నటించాడు. నిజానికి సమ్మర్ లోనే ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ లాక్ డౌన్ టైములో రామ్ ఒక్కడే అందరి డైరెక్టర్లకు అందుబాటులో ఉన్నాడు.
తన సినిమా పూర్తయిపోవడం.. తరువాత చెయ్యబోయే సినిమాను కూడా ఇతను లైన్లో పెట్టకపోవడంతో.. చాలా మంది దర్శకులు ఇతని వద్దకు క్యూలు కట్టినట్టు సమాచారం. ప్రవీణ్ సత్తారు, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల, మారుతీ ఇలా 15 మంది దర్శకులు రామ్ కు కథలు వినిపించారట. కానీ రామ్ తొందరపడి ఎవ్వరి స్క్రిప్ట్ కు కమిట్ అవ్వలేదని తెలుస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో అతని మార్కెట్ డబుల్ అయ్యింది. ఈ టైములో మునుపటిలా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి తన ఇమేజ్ కు అలాగే మార్కెట్ కు ఎఫెక్ట్ పడకూడదని అతను భావిస్తున్నట్టు తెలుస్తుంది.
అందుకే 15మంది డైరెక్టర్లకు నో చెప్పి..తన పెదనాన్న సాయంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా ఓకే చేయించుకున్నాడని సమాచారం. రామ్ కూడా స్టార్ హీరోల లిస్టులో చేరాలి అంటే .. త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యడమే బెటర్.
Most Recommended Video
ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!