Sreeleela: శ్రీలీల సినిమాల లైనప్‌ రామ్‌ సెటైర్‌… భలే చెప్పాడుగా!

టాలీవుడ్‌లో స్టార్‌ హీరో సినిమా ఏదైనా మొదలవుతుంది అంటే… ఆ కాస్ట్‌ లిస్ట్‌లో శ్రీలీల పేరు ఉందో లేదో చూసుకుంటున్నారు అభిమానులు. ఎందుకంటే కుర్ర స్టార్‌ హీరోలకు, కొంతమంది కుర్ర హీరోలకు ఆమె హీరోయిన్‌ అని పక్కాగా ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. అయితే ఇప్పుడు ఆమె కొత్త సినిమాలు ఓకే చేయడం లేదు అనుకోండి. అంతకుముందు చేసిన సినిమలు పూర్తి చేసే పనిలో ఉంది అనుకోండి. అయితే ఈ నేపథ్యంలో ఆమె సెలవు తీసుకుంటే ఎలా ఉంటుంది?

ఏంటీ.. శ్రీలీల సెలవు తీసుకుంటుందా? అని అనుకుంటున్నారా? అది కష్టమే కానీ… సపోజ్‌ పర్‌ సపోజ్‌ ఆమె సెలవు తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డిస్కషన్‌ వచ్చింది. దానికి అదే ఇంటర్వ్యూలో ఉన్న కుర్ర స్టార్‌ హీరో చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అంతగా ఏమన్నాడు అనుకుంటున్నారా… శ్రీలీల సెలవు తీసుకుంటే ఇండస్ట్రీ సెలవు తీసుకున్నట్లే అని అన్నాడు. ఆ హీరో ఎవరో కాదు రామ్‌ పోతినేని.

రామ్‌ – శ్రీలీల కలసి నటించిన సినిమా ‘స్కంద’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల ఓ కాంబో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగానే శ్రీలీల లైనప్ గురించి డిస్కషన్‌ వచ్చింది. ఆ క్రమంలో రామ్‌ అందుకుని… ‘‘శ్రీలీల సెలవు తీసుకుంటే, లేదంటే షూటింగులకు బ్రేక్ తీసుకుంటే ఇండస్ట్రీ మొత్తానికి హాలిడే ఇచ్చినట్టే. సినిమా ప్రీ లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేరు’’ అని క్లారిటీ ఇచ్చేశాడు.

రామ్‌ చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే స్టార్‌ హీరోలు ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో అధిక భాగం శ్రీలీల సినిమాలే. అంతేకాదు శ్రీలీల జోరు చూస్తుంటే… ప్రతి నెలలో ఓ హీరోతో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిందేనని పంచ్‌ వేశాడు. ఈ నెల రామ్‌ సినిమా, వచ్చే నెల బాలకృష్ణ సినిమా, ఆ తర్వాతి నెల వైష్ణవ్‌ తేజ్‌, ఆ తర్వాత నితిన్‌ సినిమా, ఆ తర్వాత మహేష్‌బాబు సినిమా… ఇలా వరుస సినిమాలు వరుస ప్రచారాలు ఉన్నాయి. మరి ఈ సమయంలో సెలవు తీసుకుంటే కష్టమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus