రామ్ – పూరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన..అనూ ఇమ్మాన్యుయేల్..!

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజే ఆ చిత్రం పట్టాలెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ప్రీ లుక్ కి మంచి స్పందన లభించింది. ఈ లుక్ లో రామ్ మరింత స్టైలిష్ గా కనిపిస్తుండడంతో.. ఈ చిత్రం పై ఆసక్తిని పెంచుతున్నాయి. రేపటి నుండీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. సమ్మర్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడట పూరి.

ఇక ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ పరిచయమవుతుందని గత కొంత కాలంగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకోబోతున్నారట. అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకోవాలనే పూరి ఓ నిర్ణయానికి వచ్చాడని, దాదాపు తననే ఖరారు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు అనూ ఇమ్మాన్యుయేల్ కి చెప్పుకోదగిన హిట్టు లేదు. ‘మజ్ను’ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘శైలజా రెడ్డి అల్లుడు’ వంటి యావరేజ్ చిత్రాలు తప్ప… ‘ఆక్సిజన్’ ‘అజ్ఞాతవాసి’ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ .. వంటి చిత్రాన్నీ డిజాస్టర్లు కావడం విశేషం. ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రంలో గెస్ట్ రోల్ ఇచ్చినప్పటికీ… పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అనూకి.. ఈ ఛాన్స్ రావడం… ఓ అదృష్టమనే చెప్పాలి. మొదటిసారి రామ్ తో జోడీ కడుతోన్న అనూ ఇమ్మాన్యుయేల్ కి.. ఈ చిత్రం హిట్ అయితే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus