యంగ్ హీరో శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీ నేడు విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత శర్వానంద్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారనే చెప్పాలి. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శర్వానంద్ శ్రీకారం మూవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శ్రీకారం మూవీ రైతు కొడుకు రైతు కావడం లేదనే పాయింట్ తో తెరకెక్కిందని శర్వానంద్ అన్నారు.
చాలామంది వ్యవసాయాన్ని ఉద్యోగంలా, వ్యాపారంలా చూడటం లేదని నష్టాలు ఎక్కువగా వస్తుండటంతో వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదని శర్వానంద్ వెల్లడించారు. ఊర్లో అందరూ కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసి లాభాలను సమానంగా పంచుకుంటే ఎవరూ నష్టపోరని ఈ సినిమాలో చూపిస్తున్నామని శర్వానంద్ తెలిపారు. టెక్నాలజీ సహాయంతో చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే నష్టాలు రావని శర్వానంద్ వెల్లడించారు. డైరెక్టర్ కిషోర్ శ్రీకారం సినిమాను బాగా తెరకెక్కించారని.. సందేశంతో కూడిన సినిమాను కామెడీ, ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ గా చెప్పడం తేలిక కాకపోయినా కిషోర్ మాత్రం ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీశారని శర్వానంద్ అన్నారు.
సినిమాలో తండ్రిని చూసి వ్యవసాయం చేయాలని భావించే హీరో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి వ్యవసాయం చేస్తాడని భవిష్యత్తులో నటనకు దూరమైతే వ్యవసాయం చేస్తానని శర్వానంద్ తెలిపారు. శ్రీకారం మూవీ కోసం చిత్తూరు జిల్లాలో 40 ఎకరాల్లో వ్యవసాయం చేశామని.. లాక్ డౌన్ లో వ్యవసాయం నేర్చుకున్నానని శర్వానంద్ అన్నారు. శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా జాతిరత్నాలు, గాలిసంపత్ సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో శ్రీకారం బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!