Simbu: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో శింబు?

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శింబు ఒకరు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు తెలుగులో కూడా వల్లభ మన్మధ వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శింబు తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటికే పలువురు హీరోయిన్లతో కొనసాగిస్తూ వార్తల్లో నిలిచారు

ఇలా ఈయనకు రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్ జరిగిన సంగతి మనకు తెలిసిందే మొదట్లో నటి నయనతారతో ప్రేమలో ఉన్నటువంటి ఈయన పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విధంగా నయనతారతో బ్రేకప్ చెప్పుకున్నటువంటి శింబు అనంతరం నటి హన్సికతో ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ భావించినటువంటి తరుణంలో వీరిద్దరి లవ్ కూడా బ్రేకప్ అయ్యింది.

ఇదే విషయాన్ని నటి హన్సిక కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా రెండుసార్లు లవ్ బ్రేకప్ ఆయన అనంతరం ఈయన పెళ్లి గురించి ఆలోచించడం మానేశారు. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసులోకి ఎంట్రీ ఇచ్చినటువంటి శింబు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం త్వరలోనే శింబు పెళ్లి చేసుకోబోతున్నారని ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈయనకు కుటుంబ సభ్యులు ఈ సంబంధం ఫిక్స్ చేశారని త్వరలోనే ఈయన పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలియ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి శింబు (Simbu) పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus