శ్రీవిష్ణు హీరోగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్లతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. జూన్ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ప్ర) ‘సామజవరగమన’ ప్రీమియర్స్ కి మంచి స్పందన లభిస్తుంది ఎలా ఫీలవుతున్నారు?
శ్రీవిష్ణు : చాలా హ్యాపీగా ఉంది. యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేయదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ ఇది. మా నమ్మకం నిజమవుతుంది అనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చూసి.
ప్ర) ఈ రెస్పాన్స్ చూస్తుంటే మీకు ఇలాంటి లైట్ వెయిట్ సబ్జెక్ట్ లే మంచి ఫలితాలు ఇస్తాయి అనిపిస్తుందా?
శ్రీవిష్ణు : ప్రేక్షకులు నా నుండి ఎక్కువ ఇలాంటివే ఆశిస్తున్నారు అనడం కరెక్ట్ కాదు. కానీ మధ్యలో ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఇవే కరెక్ట్ అని అనుకుంటున్నారేమో. తర్వాత నేను వేరే జోనర్ లో సినిమా చేసి సక్సెస్ అయితే వాళ్ళ అభిప్రాయం మారొచ్చు.
ప్ర) హాస్య మూవీస్ ,ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో ఈ మూవీ చేయడం ఎలాంటి ఫీలింగ్ కలిగించింది?
శ్రీవిష్ణు : వాళ్ళు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నా పై కూడా వాళ్ళు పెట్టుకున్న కాన్ఫిడెన్స్ కి నేను కృతజ్ఞుడనై ఉంటాను.
ప్ర) ఈ మూవీలో హీరోయిన్ రెబా మోనికా జాన్ తో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?
శ్రీవిష్ణు : నేను (Sree Vishnu) నటించే సినిమాల్లో హీరోయిన్లతో డీప్ రొమాన్స్ ఏమీ ఉండదండి. నిలబడి డైలాగులు చెప్పుకోవడం వరకు మాత్రమే ఉంటుంది. హీరోయిన్స్ తో కెమిస్ట్రీ అనే విషయంలో నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు అని నా ఫీలింగ్. పైగా నేను చదువుకునే టైంలో ఎక్కువగా కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యేవాడిని(నవ్వుతూ).
ప్ర) డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
శ్రీవిష్ణు : అతను మంచి డైరెక్టర్. ఆడియన్స్ కి నా నుండి ఏం కావాలో అది పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఇవ్వడానికి చూశాడు. ఈ మూవీని క్లీన్ ఎంటర్టైనర్ గా మలిచాడు.
ప్ర) మీ సినిమాల టైటిల్స్ కొంచెం విభిన్నంగా ఉంటాయి.. మీరే సెలెక్ట్ చేసుకుంటారా?
శ్రీవిష్ణు : కొంత వరకు ఉంటుంది. డైరెక్టర్ తో డిస్కస్ చేసిన తర్వాత అది వాళ్ళకి నచ్చితేనే ముందుకు వెళ్తాను. ఫోర్స్ చేయను. ఏదైనా కథను బట్టి, డైరెక్టర్ ని బట్టే ఆలోచిస్తాను.
ప్ర) టీజర్లో బాలయ్య బాబు ప్రైవేట్ డైలాగ్ ఒకటి పెట్టారు.. ఈ టైంలో అది ఎందుకు.. అనే భావన కలగలేదా?
శ్రీవిష్ణు : బేసిక్ గా హీరో బాక్సాఫీస్ లో టికెట్స్ బుక్ చేయడం వంటివి చేస్తుంటాడు. మొత్తం సినిమా ప్రపంచంలో మునిగితేలుతూ ఉంటాడు. అందరి హీరోల డైలాగులు, వాళ్ళ పర్సనల్ డైలాగులు చెబుతుంటాడు. అలాగే ఓ సందర్భంలో అతనికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఫ్రస్ట్రేషన్ లో అలాంటి డైలాగ్ వదులుతాడు. అంతే తప్ప.. మరో ఉద్దేశంతో పెట్టిన డైలాగ్ కాదు అది.
ప్ర) నరేష్ గారికి, మీకు మధ్య వచ్చే కామెడీ ట్రాక్ హిలేరియస్ గా ఉంది అంటున్నారు.. నిజమేనా?
శ్రీవిష్ణు : నిజమే అండి.. చాలా బాగా వచ్చింది. గతంలో నేను ఆయనతో ‘అర్జున ఫల్గుణ’ చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో చేయడం జరిగింది.మా కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు బాగుంటాయి.
ప్ర) ఎప్పుడూ కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తుంటారు..కొంచెం పెద్ద డైరెక్టర్ తో చేసి మార్కెట్ పెంచుకోవాలి అనే ఆలోచన లేదా?
శ్రీవిష్ణు : అలా ఏమీ లేదు అండి. నాన్ స్టాప్ గా నేను కథలు వింటూనే ఉంటాను. మంచి కథ అనిపిస్తే వెంటనే చేసేయాలని అనుకుంటున్నాను. పెద్ద డైరెక్టర్లు కూడా పెద్ద హీరోలు ఖాళీగా లేక ఇబ్బంది పడుతున్న టైం ఇది. వాళ్ళు మాతో చేయడానికి ఇబ్బంది పడటం కంటే ఇదే బెటర్ అనిపిస్తూ ఉంటుంది.
ప్ర) కొత్త డైరెక్టర్లతో చేయడానికి మీకు ఓకే.. కానీ నిర్మాతలు రిస్క్ అని ఫీలవ్వరా?
శ్రీవిష్ణు : నేనేమీ.. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు చేయడం లేదు కదా.!(నవ్వుతూ) నా మార్కెట్ కి తగ్గ బడ్జెట్ పెట్టుకుని.. ఆ బౌండరీస్లోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటాను కాబట్టి నిర్మాతలకి ఇబ్బంది ఉండదు.
ప్ర) ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లో రామ్ తో కలిసి నటించారు? అలా మిగిలిన హీరోల సినిమాల్లో నటించే అవకాశం ఉందా?
శ్రీవిష్ణు : తప్పకుండా..! నేను నటించడానికి రెడీగా ఉన్నాను. కానీ కథ డిమాండ్ చేయాలి కదా..! అలాంటి కథలు ఉంటే నేను ఎప్పుడూ రెడీ.
ప్ర) భవిష్యత్తులో విలన్ గా చేసే అవకాశాలు ఉన్నాయా?
శ్రీవిష్ణు : అలా చేయడానికి కూడా నాకు ఇష్టమే..! కానీ నేను అలాంటి పాత్రలు చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘వీర భోగ వసంత రాయలు’ ఆడలేదు. ‘తిప్పరా మీసం’ లో కూడా అలాంటి రోల్ చేశాను. అది కూడా నిరాశపరిచింది.
ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
శ్రీవిష్ణు : యూవీ క్రియేషన్స్ లో ‘హుషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను అలాగే ‘రాజ రాజ చోర’ ప్రీక్వెల్ లో కూడా నటిస్తున్నాను. హర్షిత్ గోలినే దానికి దర్శకుడు.