Sree Vishnu: నటుడు శ్రీ విష్ణుకు తీవ్ర అస్వస్థత!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణుని హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయనకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ బాడీలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ కావొచ్చని తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉండే శ్రీవిష్ణు సడెన్ గా ఇలా నీరసించిపోవడంతో ఆయన సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతానికి ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్న కథలను ఎన్నుకుంటూ కెరీర్ సాగిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా సినిమాలు చేశారు. లీడ్ రోల్స్ లో సినిమా అవకాశాలు రావడంతో వరుసగా చేసుకుంటూపోతున్నారు. చివరిగా ఆయన నుంచి ‘భ‌ళా తంద‌నాన‌’ అనే సినిమా వచ్చింది. కానీ ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ సమయంలో శ్రీవిష్ణు స్క్రిప్ట్ సెలెక్షన్ పై ట్రోల్స్ పడ్డాయి.

ప్రస్తుతం ఈ హీరో ‘అల్లూరి’ అనే సినిమాలో నటిస్తున్నారు. నిజాయితీకి మారుపేరు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. మరికొద్దిరోజుల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus