విడాకుల రూమర్స్‌తో శ్రీకాంత్‌ జాగ్రత్తలు.. ఏం చేస్తున్నారంటే?

పెళ్లి, ప్రెగ్నన్సీ, విడాకులు, ప్రాణం విడవడం.. ఇవన్నీ బాగా పర్సనల్‌. కానీ సినిమా జనాల విషయానికొస్తే వాటిని కూడా తమకు అనుగుణంగా మలిచేస్తుంటారు పుకారు రాయుళ్లు. అదేనండి ఏమైందో, ఏముందో కనుక్కోకుండా వాళ్లిద్దరూ విడిపోయారట కదా. విడిపోతున్నారట కదా అనేస్తుంటారు. ఇటీవల కాలంలో ఇలా విడాకులు రూమర్స్‌తో ఇబ్బంది పడిన నటుడు శ్రీకాంత్‌. భార్య ఊహ నుండి శ్రీకాంత్‌ విడిపోతున్నారు అంటూ, కారణాలు ఇవేనంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. వాటిపై అప్పుడే స్పందించిన శ్రీకాంత్‌, రీసెంట్‌గా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చి భలే కౌంటర్‌ ఇచ్చాడు.

శ్రీకాంత్‌ తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నారంటూ గతేడాది నవంబరులో వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే వాటిపై స్పందించిన ఆయన వాటిని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు కూడా. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘‘సోషల్‌ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాస్తున్నారు, నచ్చిన మాటల్ని థంబ్‌ నెయిల్స్‌గా పెట్టేస్తున్నారు. కొన్ని అయితే మరీ దారుణంగా ఉంటాయి’’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

‘‘నేను చనిపోయినట్లు ఓసారి నా ఫొటో పెట్టేసి వీడియో చేసేశారు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. అయినా నటులుగా మేం ఇలాంటి విషయాల్ని తట్టుకోగలం. కానీ ఇంట్లో వాళ్లకు, పెద్దవాళ్లకు తెలిస్తే తట్టుకోలేరు కదా. ఆ షాకింగ్‌లో వారికి ఏమైనా ఇబ్బంది అవ్వొచ్చు కదా’’ అంటూ తన ఆందోళన వ్యక్తం చేశారు శ్రీకాంత్‌. అబద్ధపు వార్తలు రాసే వారిపై యాక్షన్‌ తీసుకోవాలనుకున్నా ఫలితం ఉండదు. వ్యక్తిగతంగా వారిలో మార్పు రావాలి అని అన్నారు.

ఆ మధ్య నేను విడాకులు ఇస్తున్నాననీ వదంతలు పుట్టించారు. దాని వల్ల ఇప్పుడు మేమిద్దరం (ఊహ పక్కన ఉన్నారు) వేడుకలకు కలిసి వెళ్లాల్సి వస్తోంది అంటూ నవ్వేశారు శ్రీకాంత్‌. సినిమా ఈవెంట్స్‌ సహా ఏ వేడుకకైనా రావడానికి ఊహ ఆసక్తి చూపించదు. ఆ విషయం సినిమా పరిశ్రమలో చాలామందికి తెలుసు. కానీ ఈ విషయం తెలియకుండా మా గురించి ఏదేదో రాసేస్తున్నారు అని అన్నారు. అంతెకందుకు కోట శ్రీనివాసరావు మరణించినట్టు కూడా రూమర్స్‌ క్రియేట్‌ చేశారు. అది చూసి షాకయ్యాను అని శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus