Srikanth: డిప్రెషన్ కు గురైన శ్రీకాంత్.. షాకింగ్ నిర్ణయం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ నటుడిగా శ్రీకాంత్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించిన శ్రీకాంత్ ఆ సినిమాలతో విజయాలను సాధించారు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత శ్రీకాంత్ విలన్ రోల్స్ లో కూడా నటిస్తుండటం గమనార్హం. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో కలిసి నటించి శ్రీకాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఒక దశలో శ్రీకాంత్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో శ్రీకాంత్ డిప్రెషన్ కు గురయ్యారని ఊరెళ్లి వ్యవసాయం చేసుకోవాలని అనుకున్నారని సమాచారం.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ నటించిన సినిమాలలో ఒకే ఏడాది ఏడు సినిమాలు రిలీజ్ కాగా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో శ్రీకాంత్ ను మెగాస్టార్ చిరంజీవి ఓదార్చారని సమాచారం. ఆ తర్వాత నటించిన సినిమాలు సక్సెస్ సాధించడంతో నటుడిగా శ్రీకాంత్ కెరీర్ ను కొనసాగించారు. ప్రముఖ నటి ఊహను శ్రీకాంత్ వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ ఊహ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పెద్ద కొడుకు రోషన్ ను నిర్మలా కాన్వెంట్ సినిమాతో శ్రీకాంత్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. మరోవైపు శ్రీకాంత్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో వరదరాజులు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత వరుసగా విలన్ పాత్రలతో బిజీ అవుతానని శ్రీకాంత్ భావిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus