హీరో శ్రీకాంత్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోకి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదా అందుకున్నాడు. అతను మొదట సైడ్ క్యారెక్టర్స్ నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ ఆ తరువాత హీరోగా మంచి క్రేజ్ అందుకున్నాడు. అప్పట్లో శ్రీకాంత్ మహిళా ప్రేక్షకుల మద్దతుతో భారీ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను అందుకున్నాడు. మంచి లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు ఫ్యామిలీ హీరోగా కూడా శ్రీకాంత్ అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్నాడు.
ఇక అతను ఊహతో నటించిన మొదటి సినిమాతోనే ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఊహ కూడా హీరోయిన్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్నారు. ఇక వీరు పెళ్లి చేసుకున్న తరువాత ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలిస్తున్నారు. ఇటీవలే ఈ జంట తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీరికి కొడుకు కూతురు కూడా ఉన్నారు.
కుమారుడు రోషన్, నిర్మలా కాన్వెంట్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఇక రీసెంట్ గా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ లో చేసిన పెళ్లి సందD సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఒకవైపు చదువును కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక శ్రీకాంత్ కూడా తన కెరీర్ ను సరికొత్తగా కొనసాగిస్తున్నారు. హీరోగా అనుకున్నంతగా సక్సెస్ లు రాకపోవడంతో ఆయన సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల అఖండ సినిమాలో చేసిన నెగిటివ్ రోల్ కు కూడా మంచి క్రేజ్ దక్కింది.
అలాగే మరోవైపు హీరోగా కూడా చిన్న బడ్జెట్ లో సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య నాగచైతన్య యుద్ధం శరణం సినిమాలో కూడా పవర్ఫుల్ విలన్ గా నటించినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక బోయపాటి శ్రీను సరైనోడులో పాజిటివ్ పాత్రలో చూపించి అఖండతో మరింత విభిన్నంగా భయంకరమైన విలన్ గా చూపించి మంచి క్రేజ్ అందుకునేలా చేశారు.
1
2
3
4
5
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!