Srikanth: ఆ ఒక్క కారణంతోనే బిచ్చగాడు చేయలేకపోయాం!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో కుటుంబ కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన నటించిన ఖడ్గం ఆపరేషన్ దుర్యోధన మహాత్మా వంటి సినిమాలలో విభిన్నమైన నటనను కనబరచడంతో ఈయన నటన పట్ల ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. ఇలా నటుడిగా ఎప్పటికప్పుడు తనలో ఉన్న నటన ప్రావిణ్యాన్ని బయటపెడుతూ ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ (Srikanth) బిచ్చగాడు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.అయితే మహాత్మ సినిమాకు నటుడు విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సినిమా సమయం నుంచి తనకు విజయ్ తో చాలా మంచి పరిచయం ఉందని శ్రీకాంత్ తెలిపారు.

స్నేహితుడు కావడంతో బిచ్చగాడు సినిమా తమిళంలో తాను చూసానని అయితే ఈ సినిమా నచ్చడంతో తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేయాలని భావించాము. ఇక ఈ సినిమా గురించి చర్చలు జరుపగా నాకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తో పాటు సినిమాకు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవుతున్న కారణంగా ఈ సినిమాని రీమేక్ చేయలేకపోయాము. ఇకపోతే తెలుగులో బిచ్చగాడు సినిమాలో నేనే నటించాల్సి ఉండేదని శ్రీకాంత్ తెలిపారు.

ఇక ఈ సినిమా రీమేక్ చేయడానికి అధిక బడ్జెట్ అవుతున్న కారణంగా బిచ్చగాడు సినిమా మేకర్ ఈ సినిమాని తమిళం నుంచి తెలుగులో డబ్ చేసి విడుదల చేశారని శ్రీకాంత్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్ పాత్రలలోనూ, హీరోలకు అన్నయ్య బాబాయ్ పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus