Srikanth: విడాకులకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ ఊహ దంపతులు.. అదే కారణమా?

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో ఎవరు విడాకులు తీసుకుంటారో ఎవరికి తెలియదు. అప్పటివరకు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాల్సిన కొందరు జంటలు విడిపోతూ ఉండగా మరికొందరు మాత్రం పెళ్లయి కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినపడుతూ ఉంటాయి. ఏడాది మొదట్లో ఐశ్వర్య ధనుష్ దంపతులు విడాకులు అంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరొక సీనియర్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీకాంత్ విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.శ్రీకాంత్ సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కలరు అయితే వీరి మొదటి అబ్బాయి రోషన్ ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. త్వరలోనే శ్రీకాంత్ కుమార్తె సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు వినపడుతున్నాయి.

ఇలా శ్రీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తుండగా వీరీ గురించి విడాకులు వార్తలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఎంతో సంతోషంగా సాగిపోతున్న శ్రీకాంత్ ఊహ వైవాహిక జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని ఈ మనస్పర్ధలు కారణంగానే వీరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఊహ దంపతుల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus