తమిళ హీరో, సీనియర్ నటుడు అయిన శ్రీరామ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో ఇతను తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 2003 లో రూపొందిన ఈ మూవీ డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఇతను తెలుగులో హీరోగా సినిమాలు చేయలేదు. 4 ఏళ్ళ తర్వాత అంటే 2007 లో వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ‘పోలీస్ పోలీస్’ ‘దడ’ ‘నిప్పు’ ‘లై’ ‘రాగల 24 గంటల్లో’ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ‘రావణాసుర’ వంటి సినిమాల్లో నటించాడు.
కానీ ఇందులో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన ‘పిండం’ సినిమాలో ఇతను హీరోగా నటించాడు. డిసెంబర్ 15 న రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా కావడంతో వీకెండ్ కే ఈ మూవీ గట్టెక్కేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘పిండం’ సక్సెస్ మీట్లో శ్రీరామ్ ఎమోషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. ’15 ఏళ్ళ తర్వాత నాకు సోలో హిట్ దొరికింది.
దీంతో నేను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ప్రశాంతంగా భోజనం చేశాను. నిజాయితీగా తలపెట్టిన ఏ ప్రయత్నం కూడా నిరాశ పరచదు అని ఈ సినిమా నిరూపించింది’ అంటూ శ్రీరామ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అయితే అందరిలో ఓ ప్రశ్న ఉంది. ‘పిండం’ సక్సెస్ అనేది శ్రీరామ్ సెకండ్ ఇన్నింగ్స్ కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది అని..! ఎందుకంటే ‘పిండం’ అనేది ఓ హారర్ మూవీ. ఇలాంటి సినిమాలకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
దర్శకుడు సాయికిరణ్ దైదా ఈ సినిమాని (Pindam) తీసిన విధానం బాగుంది. ఇక నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి ఈ సినిమాని ప్రమోట్ చేసిన విధానానికి కూడా మెచ్చుకోవచ్చు. అయినప్పటికీ కూడా హీరో శ్రీరామ్ కెరీర్ కి ‘పిండం’ సక్సెస్ బూస్టప్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కొంతలో కొంత అతని ఓటీటీ మార్కెట్ అయినా పెరగొచ్చు.అది చూసి తమిళంలో రూపొందే పెద్ద సినిమాల్లో ఇతనికి ఛాన్సులు లభించవచ్చు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!