Hero Suriya: మిస్ యు సో మచ్ సర్… శ్రీనివాసమూర్తి మరణం పై సూర్య ఎమోషనల్ పోస్ట్!

గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడంతో ఇండస్ట్రీలో విషాదం నిండుకుంది. తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మృతి చెందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతోమంది స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాసమూర్తికి తెలుగులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీనివాసమూర్తి తెలుగు హీరోలకు, తమిళ స్టార్స్ అయినటువంటి సూర్య, అజిత్, విక్రమ్ లతో పాటు అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ నటులకు డబ్బింగ్ చెప్పి వారి పాత్రలకు జీవం పోశాడు.

ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీరీస్ లో సూర్య పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. ఆ సినిమాలు అంత హిట్ అవటానికి శ్రీనివాస మూర్తి వాయిస్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఇలా తమిళ్ సినిమాలకు మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాలకు సైతం డబ్బింగ్ చెప్పాడు. సినిమాలతో పాటు ఎన్నో కమర్షియల్ యాడ్స్ కి కూడా శ్రీనివాసమూర్తి తన గాత్రం అందించాడు. అయితే శ్రీనివాసమూర్తి ఇలా అకస్మాత్తుగా మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలముకుంది.

ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ్ స్టార్ హీరో సూర్య స్పందిస్తూ శ్రీనివాస మూర్తి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. శ్రీనివాసమూర్తి సూర్య మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా సూర్య నటించిన సినిమాలకు శ్రీనివాసమూర్తి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాడు. తాజాగా ఆయన మరణించడంతో సూర్య స్పందిస్తూ “శ్రీనివాసమూర్తి గారి మరణం తనకు పర్సనల్ లాస్ అని, ఆయన వాయిస్,

ఎమోషన్స్ నేను చేసిన పాత్రలకు తెలుగులో ప్రాణం పోశాయి. మిస్ యూ సర్” అని ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఈ ఎమోషనల్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus