కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసినా కూడా దర్శకుడి ఆలోచన విధానానికి పూర్తిగా న్యాయం చేయగలడు. ఒక్కసారి సినిమా కథను ఫైనల్ చేసిన తర్వాత దర్శకుడికి ఏ మాత్రం అడ్డు చెప్పడడు. ఆ లక్షణం కెరీర్ మొదటి నుంచి కూడా అలానే ఉందని చాలామంది దర్శకులు చెబుతుంటారు. ఇక సూర్య కెరీర్ ని ఒక్కసారి మలుపుతిప్పిన సినిమాల్లో శివపుత్రుడు ఒకటి. ఆ సినిమాలో మెయిన్ లీడ్ లో విక్రమ్ నటించినప్పటికీ ఆ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ సూర్య పాత్రనే.
అయితే ఆ సినిమా దర్శకుడు బాలా ప్రస్తుతం డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. ఎవరు అతనికి ఛాన్స్ ఇవ్వడం లేదు. అర్జున్ రెడ్డి రీమేక్ ను మొదట బాల డైరెక్షన్ లోనే తెరకెక్కించారు. కానీ సినిమా బాగా రాలేదని పక్కన పడేసి మరొక దర్శకుడి చేత తెరకెక్కించారు. అందులో విక్రమ్ తనయుడు ధృవ్ నటించాడు. ఇక బాల పరిస్థితి గురించి తెలుసుకున్న సూర్య.. నిర్మాతగా మారి ఒక సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చాడట.
హీరోగా కాకుండా నిర్మాతగానే సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో కీర్తి సురేష్ అథర్వ జంటగా నటించనున్నట్లు సమాచారం. 2003 రూరల్ బ్యాక్ డ్రాప్ అంశంతో దర్శకుడు కథను తెర పైకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది. సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!