Mahesh Babu: ఆ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ నటించకపోవడానికి కారణమిదే!

స్టార్ హీరో మహేష్ బాబు ఎలాంటి కథను ఎంచుకున్నా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు వేర్వేరు కారణాల వల్ల రిజెక్ట్ చేసిన సినిమాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. అయితే నువ్వులేక నేనులేను సినిమాలో హీరో పాత్ర కోసం మొదట మహేష్ బాబు పేరును పరిశీలించారట. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలో తరుణ్ నటించారని తెలుస్తోంది. నువ్వులేక నేనులేను సినిమాకు కాశీ విశ్వనాథ్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.

ఆయన ఒక సందర్భంలో ఈ సినిమా గురించి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వులేక నేనులేను సినిమా కోసం మహేష్ పేరును నిర్మాతలు పరిశీలిస్తే మహేష్ బాబుతో సినిమా తీయడానికి చాలామంది దర్శకులు క్యూలో ఉంటారని మహేష్ బాబు డేట్స్ కష్టమని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు. ఇప్పటికే నాకు సినిమా తీయడం ఆలస్యమైందని ఈ కథకు తరుణ్ సరిగ్గా సరిపోతాడని అన్నానని ఆయన వెల్లడించారు.

అప్పటికే నువ్వే కావాలి సినిమాతో తరుణ్ సక్సెస్ అందుకుని ఉండటంతో సురేష్ బాబుకు తరుణ్ పేరును సూచించానని కాశీ విశ్వనాథ్ అన్నారు. నిర్మాత సురేష్ బాబు మహేష్ బాబు పేరును సూచించగా సున్నితంగా తిరస్కరించినట్టు కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. మహేష్ బాబు ఈ సినిమాలో నటించినా బాగుండేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

అతి త్వరలో రాజమౌళి సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొననున్నారు. ఈ సినిమాకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. యాడ్స్ విషయంలో సైతం మహేష్ బాబు టాప్ లో ఉన్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus