అక్కినేని నాగేశ్వరరావు నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకు మూలస్తంభంగా ఏఎన్నార్ పాపులారిటీని సంపాదించుకున్నారు. 75 సంవత్సరాల పాటు ఏఎన్నార్ నటుడిగా కెరీర్ ను కొనసాగించారు. కృష్ణా జిల్లాలోని రామాపురంలో జన్మించిన ఏఎన్నార్ తన నటనతో ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం అందుకున్నారు. ధర్మపత్ని సినిమాతో ఏఎన్నార్ బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. ఏఎన్నార్ పూర్తిస్థాయి కథానాయకుడిగా సీతారామ జననం అనే సినిమాలో నటించారు.
మనం సినిమా ఏఎన్నార్ నటించిన చివరి సినిమా కావడం గమనార్హం. 91 సంవత్సరాల వయస్సులో ఏఎన్నార్ ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల మృతి చెందారు. ఏఎన్నార్ స్పెషల్ రోల్ లో నటించిన సినిమాలలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వెంకట్ ఈ సినిమాలో హీరోగా నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత వెంకట్ పలు సినిమాల్లో నటించినా నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.
తాజాగా ఒక షోలో పాల్గొన్న వెంకట్ మాట్లాడుతూ సినిమాలో అనుకున్న విధంగా రియాక్షన్ రాకపోతే ఏఎన్నార్ గారు లాగిపెట్టి కొట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెంకట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కథల ఎంపికలో చేసిన తప్పుల వల్లే వెంకట్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదని ఆయన అభిమానులు భావిస్తారు. లూజర్ సీజన్2 వెబ్ సిరీస్ లో వెంకట్ కీలక పాత్రలో నటించగా ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో వెంకట్ సరైన పాత్రలను ఎంచుకుని కెరీర్ విషయంలో సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. టాలెంట్ పుష్కలంగా ఉన్నా వెంకట్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!