Venkatesh: సినిమాలలో కొనసాగుతూ భారీగా సంపాదించిన వెంకటేష్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. ఈయన ప్రముఖ దివంగత నిర్మాత రామానాయుడు కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. ఇలా హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేసి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ వెంకటేష్ హీరోగా కొనసాగుతూనే ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే వెంకటేష్ కెరియర్ పరంగ కాకుండా ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే..

వెంకటేష్ నీరజ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు సంతానం కాగ ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ఇప్పటికే పెద్దమ్మాయికి ఎంతో ఘనంగా వివాహం చేయగా రెండవ అమ్మాయికి కూడా ఇటీవల నిశ్చితార్థం చేశారు. ఇక తన కుమారుడు ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇక వెంకటేష్ ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే దాదాపు రెండు వేల కోట్లు ఆస్తిపాస్తులను సంపాదించారని తెలుస్తోంది.

ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా వెంకటేష్ సినిమాలలో కొనసాగుతూనే విలువైన ఆస్తులను కూడా పెట్టారు. ఇకపోతే ఈయనకు తన తండ్రి నుంచి వారసత్వంగా మరొక వెయ్యి కోట్లు అదనంగా వచ్చాయని తెలుస్తుంది.ఇలా ఈయన మూడువేల కోట్లు రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈయన (Venkatesh)  సైంధవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus