వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అరెరె కు మంచి రెస్పాన్స్ లభించింది, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకాధారణ లభించింది. తాజాగా ఈ చిత్ర సెకండ్ సాంగ్ “ఎవరే నువ్వు” ను హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు, మొట్టమొదటి ఒక తెలుగు సినిమా పాటను విజయ్ సేతుపతి లాంచ్ చెయ్యడం విశేషం, ప్రేమిస్తున్నా సినిమా విజయం సాధించాలని చిత్ర యూనిట్ సభ్యులకు విజయ్ సేతుపతి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరే నువ్వు పాటను పూర్ణ చంద్ర రచించగా సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ…
మా ప్రేమిస్తున్నా సినిమా సెకండ్ సాంగ్ ఎవరే నువ్వు ను హీరో విజయ్ సేతుపతి గారు విడుదల చెయ్యడం మా చిత్ర యూనిట్ అందరికి సంతోషకరమైన విషయం. మా సినిమా కథ కథనాలు విజయ్ సేతుపతి గారు తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యడం విశేషం. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా అని అన్నారు.
ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.