Vijay, Vamshi Paidipally: మరోసారి కథతో కుస్తీపడుతున్న వంశీ పైడిపల్లి!

ప్రాజెక్టు కుదిరినంత ఈజీ కాదు… కథ ఓకే అవ్వడం. టాలీవుడ్‌లోనే కాదు అన్ని వుడ్స్‌లోనూ ఇలా ప్రాజెక్టు కుదిరి కథ కుదరక కుస్తీలు పట్టిన దర్శకులు, రచయితలు చాలామంది ఉన్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడట. ఇక్కడ హీరో ఎవరో కాదు విజయ్‌. అవును విజయ్‌ కోసం వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన కథ ఓకే అవ్వలేదు. దీంతో మళ్లీ కథ మీద కూర్చున్నాడట వంశీ.

దిల్‌ రాజు నిర్మాణంలో విజయ్‌ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అది కన్‌ఫార్మ్‌ కూడా అయ్యింది. వంశీ చెప్పిన పాయింట్‌ నచ్చడంతో విజయ్‌ పూర్తి కథ సిద్ధం చేయమన్నాడని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో విజయ్‌ గత కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉన్నాడు. అలా సిద్ధం చేసిన కథను విజయ్‌కు వినిపించారట. కథపై సంతృప్తి చెందని విజయ్‌… కొన్ని మార్పులు సూచించారని టాక్‌.

‘మహర్షి’ తర్వాత వంశీపైడిపల్లి బ్రేక్ తీసుకున్నారు. ఈ సమయంలో మహేష్‌బాబు కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేశారనే టాక్‌ వినిపించింది. అయితే ఆ కథ మహేష్‌కు నచ్చకపోవడంతో దాని మీద ఇలానే కొద్ది రోజులు వర్క్‌ చేశాడు వంశీ పైడిపల్లి. ఈ క్రమంలో మహేష్‌ వేరే పనుల్లో బిజీ అయిపోవడంతో ఆ సినిమా అలా పక్కనుండి పోయింది. ఇప్పుడు విజయ్‌ సినిమా ఏమవుతుందో చూడాలి. ‘ఆహా’లో కథలు ఫైనలైజ్‌ చేసే వంశీ… తన కథ ఫైనలైజ్‌ చేసుకోలేకపోతున్నారేంటో మరి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus