లాక్ డౌన్ ఎఫెక్ట్, కెనడాలో ఇరుక్కుపోయిన స్టార్ హీరో కొడుకు

  • April 14, 2020 / 05:52 PM IST

కరోనా వైరస్ గుప్పిట్లో ప్రపంచం ఊపిరాడక అల్లాడుతోంది. ఈ శతాబ్దంలో ఇలాంటి ఘోర పరిస్థితి ఏర్పడలేదు. ప్రపంచం మొత్తం స్థంభించి పోగా ప్రజా జీవనం అస్తవ్యస్థం అవుతుంది. సామాన్యులు సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని భాదితుల సంఖ్య లక్షల్లోకి చేరుకోగా, వేలల్లో మరణాలు సంభవించాయి. ప్రపంచ రవాణా వ్యవస్థ నిలిపివేయడంతో ఎక్కడివారు అక్కడ ఇరుక్కుపోయారు.

ఇతర దేశాలలో ఉన్న వలస కార్మికులు చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక, ఇంటికి వెళ్లే దారిలేక అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితులు కోటీశ్వరులకు కూడా సమానంగా ఉన్నాయి. కాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాన్సన్ కెనడాలో ఉండిపోయారట. జాన్సన్ కొన్నాళ్ల క్రితం ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయడానికి కెనడా వెళ్లి అక్కడే ఉంటున్నాడట. ఐతే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో కెనడా కూడా వుంది. అక్కడ కరోనా వైరస్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతూ పోతున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొడుకు ఆరోగ్యం పట్ల విజయ్ ఆందోళన చెందుతున్నాడట. కెనడా నుండి జాన్సన్ ని ఇంటికి రప్పించే మార్గం లేని పక్షంలో రోజు ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుకుంటున్నారట. కాగా కొద్దిరోజుల క్రితం మంచు విష్ణు తన పిల్లలు అమెరికాలో ఉండిపోయారు, వారిని బాగా మిస్ అవుతున్నానని ఆవేదన చెందారు. ఇక ఇండియాలో కూడా పరిస్థితులు రోజు రోజుకు కఠినంగా మారుతున్నాయి. దీనితో ప్రభుత్వాలు లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించాయి.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus