స్మార్ట్ ఫోన్ యూజర్లపై విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్

  • April 16, 2019 / 08:27 PM IST

“నేను రౌడీ, నా ఫ్యాన్స్ అందరూ రౌడీస్” అని ఎప్పూడూ చాలా గర్వంగా చెప్పే విజయ్ దేవరకొండ.. సడన్ గా గేర్ మార్చి స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ గొర్రెలు అని స్టేట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఇక్కడ విజయ్ స్టేట్ మెంట్ ఇచ్చింది స్మార్ట్ ఫోన్ వాడుతున్నవాళ్లందరినీ ఉద్దేశించి కాదు.. కొత్త మోడల్ వచ్చింది కదా అని డిస్కౌంట్స్ గురించి ఆలోచించకుండా స్మార్ట్ ఫోన్స్ కొనేసేవాళ్లను గురించి. ఇదంతా “సంగీత మొబైల్స్” యాడ్ లో చెప్పాడు విజయ్ దేవరకొండ. ఈ యాడ్ విడుదలై చాలా రోజులవుతున్నప్పటికీ.. విజయ్ స్టేట్ మెంట్ నూన్ ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ షాక్ అయ్యి.. ఇదేంటి విజయ్ అంత మాట అనేశాడు అని షాకైనప్పటికీ.. ఇదంతా యాడ్ ఫిలిమ్ కోసమని తెలిసాక లైట్ తీసుకున్నారు.

విజయ్ దేవరకొండ క్రేజ్ & ఫాలోయింగ్ పుణ్యమా అని సంగీత మొబైల్స్ కంపెనీకి సేల్స్ & పాపులారిటీ మాత్రం బాగా పెరిగింది. హీరోలు ఇలా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడం కొత్తేమీ కాదు కానీ.. విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ స్టార్ హీరో ఒక మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం.. విజయ్ ఇమేజ్ ను బేస్ చేసుకొని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ యాడ్స్ ను క్రియేట్ చేయడంతో ఆ యాడ్స్ జనల్లోకి బాగా వెళ్ళాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా కొన్ని ముబైల్ కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఆ బ్రాండ్స్ కి “సంగీత ముబైల్స్” రేంజ్ పబ్లిసిటీ రాకపోవడం గమనార్హం. సంగీత ముబైల్స్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. మనం వేలకి వేలు పెట్టి కొట్టి కొనే ఫోన్లు పోతే ఏ ఒక్క కంపెనీ బాధ్యత వహించదు. కానీ.. సంగీత ముబైల్స్ అలా కాదు.. ఒకవేళ కస్టమర్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ముబైల్ పోతే గనుక సంగీత ముబైల్స్ వాళ్ళకి ఒక కొత్త ముబైల్ ను ఉచితంగా ఇచ్చే పాలసీని ప్రవేశపెట్టింది. అందుకే.. విజయ్ దేవరకొండ ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ కొని గొర్రెలవ్వకండి అంటూ పిలుపునిచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus