Vijay: హీరోకే అంతిస్తే.. ఇక బడ్జెట్ ఎంతో..?

కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు విజయ్. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన సినిమాలకు మార్కెట్ ఓ రేంజ్ లో జరుగుతుంది. డిజిటల్ రైట్స్, నా థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ ఇలా చాలా రకాలుగా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు. దీనికి తగ్గట్లే ఆయన రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ రెమ్యునరేషన్ రూ.80కోట్ల రేంజ్ లో ఉంది. టాలీవుడ్ తో పోల్చుకుంటే.. కోలీవుడ్ లో హీరోల రెమ్యునరేషన్లు చాలా ఎక్కువ. అజిత్ ఏకంగా వంద కోట్లు కూడా తీసుకుంటుంటారు.

అయితే నిర్మాత దిల్ రాజు ఇప్పుడు విజయ్ కి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి టాలీవుడ్ కి తీసుకొస్తున్నారని సమాచారం. విజయ్ నేరుగా చేసే తొలి సినిమా ఇది. నిజానికి కోలీవుడ్ తో పోలిస్తే ఇక్కడ విజయ్ కి అంత క్రేజ్ లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మాస్టర్’ సినిమా కూడా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. అలాంటిది ఇప్పుడు విజయ్ కి రూ.80 కోట్లకు మించి రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడట దిల్ రాజు.

ఒక్క విజయ్ పారితోషికమే రూ.80 నుండి రూ.90 కోట్ల రేంజ్ లో ఉంటే ఇక సినిమా టోటల్ బడ్జెట్ 150 కోట్లకు మించి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా అంటే కనీసం 50 నుండి 60 కోట్ల ఖర్చు ఉంటుంది కాబట్టి. టెక్నీషియన్స్, నటీనటుల రెమ్యునరేషన్, షూటింగ్ అన్నీ కూడా ఓ స్థాయిలో ఉండేలా చూసుకుంటారు గనుక మొత్తం బడ్జెట్ రూ.150 కోట్లను దాటిపోవడం ఖాయం. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం. మరి ఇంత ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్న దిల్ రాజుకి ఏ రేంజ్ లో లాభాలు వస్తాయో చూడాలి!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus