Hero Vikram Hospitalised: హీరో విక్రమ్ కు గుండెపోటు.. టెన్షన్ లో ఫ్యాన్స్!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండెపోటు తో ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈరోజు ఉదయం ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో విక్రమ్ కు గుండెపోటు వచ్చినట్టు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చెన్నైలో ఉన్న కావేరి ఆసుపత్రికి తరలించారు.వైద్యులు నార్మల్ టెస్టులు చేశారు. ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు అని.. ప్రస్తుతం అతని కండిషన్ బాగానే ఉందని..

ఈరోజు సాయంత్రం లేదా నైట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్లొచ్చు అని.. వైద్యులు తెలిపారు.అయితే కొన్నాళ్ల పాటు ఎక్సర్సైజ్ లు వంటి వాటికి దూరంగా ఉండాలని వారు సూచించారట. ఈ వార్తను చాలా గోప్యంగా ఉంచాలి అని భావించినప్పటికీ.. చాపకింద నీరులా చెన్నై మీడియా పాకించేసింది అని విక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. గతంలో ఎన్నో తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విక్రమ్.. అటు తర్వాత తమిళంలో హీరోగా నటిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో అతను బాల దర్శకత్వంలో చేసిన ‘శివపుత్రుడు’ 2004 లో విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలో అతని నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. అటు తర్వాత 2005లో వచ్చిన ‘అపరిచితుడు’ చిత్రం విక్రమ్ ను స్టార్ హీరోని చేసింది. అయితే ఆ తర్వాత అతని నుండి వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు.శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఐ’ చిత్రం సైతం నిరాశపరిచింది. ఈ ఏడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘మహాన్’ చిత్రం కొంత వరకు పర్వాలేదు అనిపించింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus