Hero Vikram: ఐదు భాషల్లో డబ్బింగ్.. విక్రమ్ రేర్ ఫీట్!

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో తెలిసిందే. ఈ విషయంపై ఆయన కుమారుడు ధృవ్ విక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని.. పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని తన సోషల్ మీడియా అకౌంట్ లో రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. విక్రమ్ నటించిన కొత్త సినిమా ‘కోబ్రా’ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాతో విక్రమ్ అరుదైన ఘనత అందుకోబోతున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మొత్తం ఐదు భాషలకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విక్రమ్ గొంతే వినిపించబోతుంది. నిజానికి ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఇలాంటి రేర్ ఫీట్ అందుకునేవాడు కానీ సమయం కుదరక మలయాళ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పలేకపోయారు. లేదంటే ఎన్టీఆర్ కి ఆ రికార్డ్ ఉండేది. ఇప్పుడు విక్రమ్ తన సినిమా విషయంలో ఈ రేర్ ఫీట్ అందుకోవాలనుకుంటున్నారు.

కొంచెం రిస్క్ అయినా సరే ‘కోబ్రా’ అన్ని వెర్షన్స్ కి డబ్బింగ్ చెబుతానని విక్రమ్ ముందుకు రావడం ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తోంది. విక్రమ్ తన సినిమాలకు సంబంధించిన ఎలాంటి టాస్క్ చేయడానికైనా ముందుకొస్తాడు. గతంలో ‘ఐ’ వంటి సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడ్డారో తెలిసిందే. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన అభిమానులను సంతృప్తి పరచడం కోసం చాలా కష్టపడుతుంటాడు విక్రమ్. ఇప్పుడు ‘కోబ్రా’ సినిమాలో రకరకాల వేషాల్లో కనిపించబోతున్నాడు ఈ హీరో.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus