విశాల్, ఎస్.జె.సూర్య, రీతూ వర్మ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో విశాల్ మాట్లాడుతూ ‘రివ్యూలతో పాటు కలెక్షన్లు బాగున్న చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి,వాటిల్లో మా చిత్రం కూడా ఉండడం ఆనందంగా ఉంది, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. థియేటర్‌కు జనాల్ని రప్పించడం కష్టమవుతోంది. రెండున్నర గంటల సినిమాను రెండున్నర నిముషాల ట్రైలర్‌లో చూపించి, ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించాలి.
అలా మా ట్రైలర్ నచ్చడం వల్లే జనం థియేటర్‌కు వస్తున్నారు. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య అద్భుతంగా నటించారు. ఆయనతో కలసి నటించడం ఆనందంగా ఉంది. సునీల్ కామెడీ ఓ మెడిసిన్ లాంటిది. సినిమాలోని ప్రతి సీన్‌కు జనం బాగా నవ్వుతున్నారు. తెగిన ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయి రైతులకు ఇస్తాను’ అని చెప్పారు. కొత్త కాన్సె్‌ప్టతో సినిమా తీశాం. జనం చూసి ఆనందిస్తున్నారు. విశాల్ మాస్ హీరో అయినా ఈ కథలో నాకు కూడా సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారు. దర్శకుడు అధిక్ స్ర్కీన్‌ప్లే బాగుంది.
సునీల్ ఇప్పుడు తమిళంలో చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోంది’ అన్నారు ఎస్.జె.సూర్య. హాస్యనటుడు సునీల్ మాట్లాడుతూ ‘నా జీవితాంతం గుర్తుకు పెట్టుకునే సినిమా ఇది. విశాల్ నిజంగానే విశాలమైన మనసు ఉన్న హీరో. నాకు తమిళం రాదు. అయినా సెట్‌లో ప్రతి డైలాగ్‌కు ప్రాప్టింగ్ ఇచ్చి నాతో చేయించుకున్నాడు.
ఈ సినిమా కోసం తమిళం నేర్చుకోవడం కొత్త అనుభూతి ఇచ్చింది’ అన్నారు. ‘తొమ్మిదేళ్లుగా విశాల్‌తో ప్రయాణం చేస్తున్నాను. ‘మార్క్ ఆంటోనీ’ నాకు రచయితగా, దర్శకుడిగా పునర్జన్మ ఇచ్చింది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన (Vishal) విశాల్‌కు కృతజ్ఞతలు’ అన్నారు దర్శకుడు అధిక్ రవిచంద్రన్.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!