టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటుడిగా విశాల్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోలలో విశాల్ ఒకరు కావడం గమనార్హం. అయితే 2024 ఎన్నికల్లో విశాల్ వైసీపీ తరపున కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది. విశాల్ తండ్రి కృష్ణారెడ్డి తెలుగువారు కాగా విశాల్ సీఎం జగన్ కు అభిమాని అని సమాచారం. అయితే విశాల్ డైరెక్ట్ గా స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే విశాల్ నిజంగా ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. అక్కడ చంద్రబాబును ఓడించటం సులువైన విషయం కాదు. అయితే చంద్రబాబు మెజారిటీ మాత్రం అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో కుప్పంలో వైసీపీ హవా కొంతమేర పెరుగుతోంది. 2024 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ గెలిచే విధంగా వైసీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విశాల్ ఏపీ రాజకీయాలపై దృష్టి పెడతారో లేక సినిమాల్లోనే కెరీర్ ను కొనసాగిస్తారో చూడాల్సి ఉంది. విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తే మాత్రం ప్రజల్లో ఈ నియోజకవర్గంపై దృష్టి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.
మరోవైపు కుప్పంలో టీడీపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటంతో 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అని ప్రజల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. నవరత్నాల అమలు వల్ల 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని జగన్ భావిస్తుండగా ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయో లేక విడిగా పోటీ చేస్తాయో చూడాల్సి ఉంది.