RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోల ప్రమోషన్స్‌… ఇంకా ఎంతకాలం!

సినిమాకు ప్రచారం చేయడానికి హీరోలు ముందుకు రావడం పెద్ద విషయమేమీ కాదు. సినిమా విడుదల వరకు, సినిమా విడుదలైన ఓ పది రోజుల వరకు ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు చిన్న సినిమాల టీమ్‌ అయితే ఆ తర్వాత ఓటీటీ రిలీజ్‌లకు కూడా ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్‌లో చాలా రోజులుగా ఇదే సాగుతోంది. కానీ సినిమా విడుదలై పది నెలలు అయిపోయినా సినిమా ప్రచారానికి హీరోలు వస్తున్నారు అంటే గ్రేటే కదా. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది మేం ఎవరి గురించి చెబుతున్నామో.

వాళ్లే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలు రామ్‌చరణ్‌, తారక్‌. ఈ సినిమా ప్రచారం కోసం ఈ ఇద్దరూ ఇటీవల టోక్యో ఫ్లైట్‌ ఎక్కారు. అక్కడ దిగి అభిమానులతో సందడి చేయడానికి సిద్ధమైపోయారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను జపాన్‌ అభిమానుల కోసం అక్కడ రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. జపాన్‌లో తారక్‌, చరణ్‌కు అభిమానులు భారీగానే ఉన్నారు. మనోళ్ల పాటల్ని రీమిక్స్‌లు, రీల్స్‌ చేసి వదులుతుంటారు. అవి రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్‌ సాధిస్తుంటాయి. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను అక్కడ విడుదల చేస్తున్నారు.

దీంతో సినిమాను జపాన్‌లో విడుదల చేసి భారీగా వసూళ్లు సాధించే పనిలో పడ్డారు రాజమౌళి అండ్‌ కో. దీని కోసం ఏకంగా అక్కడ హీరోలతో ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌, స్పెషల్‌ షోలు, ఫ్యాన్‌ మీట్‌లు పెడుతున్నారు. సినిమా విడుదలయ్యాక కొత్త సినిమాలో పడిపోయారు ఈ ఇద్దరు హీరోలు. అయినా ఇప్పుడు పాత సినిమా ప్రచారానికి వెళ్తున్నారు అంటే ఎంత అభిమానమో అని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇదంతా ఆస్కార్‌ కోసం చేస్తున్న సందడి అనేవాళ్లూ ఉన్నారు.

ఆస్కార్‌ కోసం జనరల్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మన దేశం నుండి అఫీషియల్‌ ఎంట్రీ వస్తుందని కొంతమంది అనుకున్నా.. ‘అంత సీన్‌ లేదు’ అంటూ వేరే సినిమాను పంపారు. దీంతో ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌ నేరుగా పోటీకి సిద్ధమైంది. దీంతోనే ఇలా ఇంటర్నేషనల్‌ రిలీజ్‌ల వేగం పెంచి ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. మరి రాజమౌళి ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus