కథలు హిట్ అవుతాయా ? ఫ్లాప్ అవుతాయా ? అనేది కరక్ట్ గా చెప్పలేము. కొంతమంది హీరోలు కథ బాగాలేదని తిప్పికొట్టినవి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సార్లు బాగా ఆడవు అనుకున్నవి అపజయం పాలై తమ అంచనా కరక్ట్ చేసినవి ఉన్నాయి. అటువంటి వాటిలో కొన్ని..
1. బద్రీనాథ్వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన బద్రీనాధ్ కథ మొదట ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ఆ కథను ప్రభాస్ రిజెక్ట్ చేశారు.
2. వీరవాస్తవానికి వీర సినిమాని బాలకృష్ణ చేయాల్సింది. మొదట భీష్మ అనే టైటిల్ అనుకున్న ఈ స్టోరీ బాలయ్యకి నచ్చలేదు. కానీ రవితేజకి నచ్చింది. కస్టపడి నటించినప్పటికీ హిట్ సాధించలేకపోయింది.
3. ఊసరవెల్లిసురేందర్ రెడ్డి ఊసరవెల్లి మూవీ స్క్రిప్ట్ మొదట రామ్ కి చెప్పారు. కానీ ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని రామ్ కోరడంతో ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది.
4. రభసబెల్లంకొండ సురేష్ నిర్మించిన రభస కథకు మొదట రామ్ ఒకే చెప్పారు. అయితే ఇద్దరి మధ్య వచ్చిన గొడవ కారణంగా ఎన్టీఆర్ నటించారు.
5. అనగనగా ఓ ధీరుడుసిద్ధార్ధ్ అంధ వీరుడిగా నటించిన అనగనగా ఓ ధీరుడు కథని రామ్ చరణ్, రానా, ప్రభాస్ .. ముగ్గురు చేయమన్నారు.
6. ఎందుకంటే ప్రేమంటవినూత్నమైన కథతో తెరకెక్కిన ఎందుకంటే ప్రేమంట స్టోరీ మొదట ప్రభాస్ కి వినిపించారు. కానీ అతను చేయకపోవడంతో రామ్ కి వెళ్ళింది.
7. ఇద్దరమ్మాయిలతోపూరి జగన్నాథ్ ఇద్దరమ్మాయిలతో కథను ఎన్టీఆర్ కోసం రాసుకున్నారు. అయితే అతను చేయను అని చెప్పడంతో అల్లు అర్జున్ చేశారు.