ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి హీరోయిన్, విలన్ ఫిక్స్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేయనున్న సినిమాకు విలన్ ఖరారు అయ్యాడు.  ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ తో ప్రభాస్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం బాహుబలి – ది కంక్లూజన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ దర్శకుడు సుజిత్ ని సినిమా పనులు మొదలు పట్టమని చెప్పాడు. దీంతో ఆరిస్టులను సెలెక్ట్ చేస్తున్నాడు.

ప్రభాస్ రేంజ్ కి తగినట్లు ఉండాలని బాలీవుడ్ నటుడు, తమిళ హిట్ మూవీ కత్తి లో విలన్ గా చేసిన నీల్ నితిన్ ముఖేష్ ని సంప్రదించడం, అతను ఓకే చెప్పడం జరిగి పోయాయి. యు.వి.క్రియేషన్స్ వాళ్లు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రతి కథానాయకుడితో పాటు కథానాయకి ఎంపిక కూడా జరిగి పోయింది. తన కథకు అమీ జాక్సన్ అయితే బాగుంటుందని సుజిత్ ఆమెను కలిశారట.

డార్లింగ్ తో సినిమా అనగానే ఆమె ఒప్పేసుకుందని సమాచారం. అమీ జాక్సన్ ఇది వరకు ఎవడు, ఐ సినిమాల్లో నటించింది. ఈ భామ ప్రస్తుతం శంకర్ సినిమా రోబో 2.0, అభినేత్రి సినిమాల్లో బిజీగా ఉంది. అభినేత్రి దాదాపు పూర్తి అయింది. రోబో 2.0 కంప్లీట్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. దాని తర్వాత అమీ ప్రభాస్ తో ఆడి పాడనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus