Anjali: పెళ్లి చేసుకుంటానన్నా నమ్మేలా లేరు: అంజలి షాకింగ్‌ కామెంట్స్‌

  • May 28, 2024 / 05:12 PM IST

హీరో – హీరోయిన్‌ కలసి వరుసగా రెండు సినిమాలు చేసినా.. దగ్గరదగ్గర్లో సినిమాలు చేసినా ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఓ రూమర్‌ ఆటోమేటిగ్గా క్రియేట్‌ అయిపోతుంది. అందులో నిజం ఉందా? లేదా? అనే విషయంలో తెలుసుకునే క్రమంలో ఇద్దరూ కలసి నటించిన సినిమా రిలీజ్‌ అయ్యి కావాల్సినంత ప్రచారం వచ్చేస్తుంది. అయితే దీనికి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. ఇప్పుడు వాటి గురించే అంజలి (Anjali) మాట్లాడింది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi) అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అంజలి..

త్వరలో విశ్వక్‌సేన్‌తో కలసి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari)  సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల 31న రానున్న నేపథ్యంలో అంజలి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఈ సినిమాలో బోల్డ్‌ సంభాషణలు చెప్పాని, అవి నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను అని చెప్పింది. అయితే ఇప్పుడు సినిమాలో ఆ డైలాగ్స్‌ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయని చెబుతోంది.

ఇక అంజలి బయటకు వస్తే ఆమె పెళ్లి టాపిక్‌ చర్చకు వస్తుంది. అందుకే పెళ్లి విషయమై తరచూ వార్తలు వినిపిస్తుంటాయి కదా.. దీనిపై మీ ఆలోచనలు ఏంటి? అని అడిగితే.. సోషల్‌ మీడియా నాకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేసింది అని నవ్వేసింది అంజలి. మొదట్లో ఇలాంటి గాసిప్స్‌ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లని, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పింది అంజలి.

తన పెళ్లిపై ఇప్పటివరకు వచ్చిన గాసిప్స్‌ వల్ల.. తాను నిజంగా ఒక అబ్బాయిని తీసుకెళ్లి ‘ఇతన్నే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పినా ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు అంటూ మరోసారి నవ్వేసింది అంజలి. ఇక తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే దానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పింది. కానీ తాను సినిమాలతో బిజీగా ఉన్నానని, తప్పకుండా పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా అని క్లారిటీ ఇచ్చింది అంజలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus