తన భర్తకు హీరోయిన్ ను సెట్ చేసే పనిలో పడిన నమ్రత..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సినిమాలో అయినా.. మహేష్ పక్కన హీరోయిన్ ఆనదు.. అంటే మహేష్ గ్లామర్ కు సరితూగదు అని..! మహేష్ ఈ మధ్య కాలంలో నటించిన ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలలో పూజా హెగ్దే, రష్మిక వంటి క్రేజీ భామలు మహేష్ గ్లామర్ ముందు తెలిపోయారు. ఈ కంప్లైంట్ మహేష్ అభిమానులే కాదు మరికొందరు ప్రేక్షకులు కూడా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మహేష్ కు హీరోయిన్ ను వెతకడంలో ఆయన భార్య నమ్రత స్పెషల్ కేర్ తీసుకోవడానికి రెడీ అయ్యిందట. ఇప్పుడు మహేష్ 3 నెలలు గ్యాప్ తీసుకుని తన తరువాతి చిత్రం కోసం రెడీ అవుతాడు. ఇక ‘మహేష్ 27’ ను ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ పైన కసరత్తులు మొదలుపెట్టాడు వంశీ. ఇదిలా ఉంటే.. మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా మళ్ళీ పూజా హెగ్దేను తీసుకోవాలని వంశీ అనుకున్నాడట. కానీ ‘భరత్ అనే నేను’ లో హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ అయితేనే మహేష్ కు కరెక్ట్ జోడి అని .. నమ్రత రికమండ్ చేస్తుందట. ఇక కియారా దాదాపు ఫైనల్ అయినట్టే అని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus