ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా డీజే బ్యూటీ!

యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ అనుకున్న దానికన్నా కొంచెం నెమ్మదిగానే సాగుతోంది. ఈ చిత్రం రిలీజ్ ఆలస్యం అవుతుందని ఉద్దేశంతో.. అభిమానులకోసం మరో సినిమాని కంప్లీట్ చేయాలనీ ప్రభాస్ డిసైడ్ అయ్యారు. అందుకే తర్వాత సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టెక్నీషియన్లు, ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు.

తాజాగా హీరోయిన్  ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. డీజే సినిమాలో అందాలు ఆరబోసి పరిశ్రమ దృష్టిలో పడ్డ పూజా హెగ్డేని ప్రభాస్ కి జోడీగా తీసుకున్నట్లు తెలిసింది. అలాగే ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. ప్రభాస్ 20 వ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus