బహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ స్టార్ గా ఎదిగారు. పొరుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా డార్లింగ్ కి అభిమానులు ఏర్పడ్డారు. దీంతో అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ విస్తరించింది. “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న సినిమాకు జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లను తీసుకున్నారు.
విలన్ గా హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ని ఖరారు చేశారు. టెక్నీషియన్లను, ఆర్టిస్టులను ఎంపికలో స్పీడ్ చూపించిన డైరక్టర్ హీరోయిన్ విషయంలో కొంతకాలంగా వెతుకుతూనే ఉన్నారు. ప్రభాస్ కి తగిన కొత్త ముద్దుగుమ్మను వెతుకుపట్టుకోవడం సుజీత్ కి కష్టమైంది. మొదట ఐ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా అనుకున్నప్పటికీ, కొత్త నటి అయితే బాగుంటుందని తాజాగా డిసైడ్ అయ్యారు. సో ఉత్తర భారత దేశంలోని పలు మోడల్ ఏజెన్సీల చుట్టూ చిత్ర బృందం తిరుగుతోంది. జనవరి చివరి లోపున డార్లింగ్ కి సూటయ్యే బ్యూటీని సెలక్ట్ చేయాలనీ భావిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.