Mahesh, Trivikram: కథ ఫిక్స్‌ అనుకుంటే.. హీరోయిన్‌ అడ్డొచ్చిందట!

ఓ స్టార్‌ హీరో ఓ సినిమా అనుకుంటే అన్ని పనులు ఆటోమేటిగ్గా పూర్తయిపోవాలి, సినిమా వెంటనే మొదలైపోవాలి, అంతే వేగంగా సినిమా రిలీజ్‌ అవ్వాలి. ఈ క్రమంలో హిట్‌ కూడా కొట్టేయాలి. అయితే ఈ విషయంలో ఎక్కడ ఆలస్యం జరిగినా అభిమానులు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితిలో టాలీవుడ్‌ ఇబ్బంది పడుతున్న హీరోల అభిమానుల్లో మహేష్‌బాబు అభిమానులు ఒకరు. త్రివిక్రమ్‌తో 11 ఏళ్ల తర్వాత సినిమా అనేసరికి అందరూ ఆసక్తిగా వెయిట్‌ చేశారు. కానీ సినిమా మొదలవ్వడానికి మాత్రం ఇంకా ఏదో అడ్డుపడుతూనే ఉంది.

‘సర్కారు వారి పాట’ హిట్‌ (?) ఎఫెక్ట్‌తో త్రివిక్రమ్‌ సినిమా కథ విషయంలో మహేష్‌బాబు కొన్ని మార్పులు చెప్పారని ఆ మధ్య వార్తలొచ్చాయి. దానికి తగ్గట్టుగా ఆ సినిమా ఆలస్యమైంది. ఈలోపు మహేష్‌ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లి వచ్చేశాడు. మార్పులు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్‌ సినిమా కథ ఫైనల్‌ నెరేషన్‌ ఇచ్చారట. ఇప్పటికి కథ ఓకే అవ్వడంతో జులైలో సినిమా అనుకున్నారు. కానీ అనుకున్నట్లుగా సినిమా మొదలవ్వలేదు. దానికేదో కారణం ఉంది, ఇప్పుడు వాటికి మరో కారణం యాడ్‌ అయ్యింది అని అంటున్నారు.

సినిమా మీద పుకార్లు వస్తుండటంతో టీమ్‌ ఇటీవల ఓ షార్ట్‌ వీడియో రిలీజ్‌ చేసింది. సినిమాను ఆగస్టు నుండి ప్రారంభిస్తామని చెప్పింది. కచ్చితంగా అవుతుంది అని కూడా అంటున్నారు. అయితే సినిమా కోసం అవసరమైన నటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు అని తాజా సమాచారం. ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇందులో సెకండ్‌ హీరోయిన్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మీడియాలో. దీంతో ఆమె ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది.

అదేంటి.. శ్రీలీలను ఆ పాత్ర కోసం తీసుకున్నారు కదా అంటారా. అనుకోవడం వరకు వాస్తవమే కానీ, ఇంకా ఆమెను ఫైనల్‌ చేయలేదట. మరో హీరోయిన్‌ అయితే బాగుంటుందని టీమ్‌ అనుకుంటోందట. దీని కోసం బాలీవుడ్‌ కొత్త అమ్మాయిలను, కేరళ కుట్టిలను కూడా చూశారట త్రివిక్రమ్‌ అండ్‌ కో. ఎవరూ మహేష్‌బాబు పక్కన సరిపోవడం లేదట. దీంతో గతంలో నటించిన హీరోయిన్లను ఎవరినైనా చూద్దాం అనుకుంటున్నారట. ఆ లెక్కన సినిమాకు మేజర్‌ పెండింగ్‌ ఇప్పుడు సెకండ్‌ హీరోయినే అంటున్నారు. ఫస్ట్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్న విషయం తెలిసిందే.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus