Soundarya: సౌందర్య చనిపోతే ఆ హీరోయిన్ కు వచ్చే లాభమేంటి… ఘోరం ఇది..!

దివంగత స్టార్ హీరోయిన్, ‘మహానటి’ సావిత్రి గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన నటి సౌందర్య అనే చెప్పాలి. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు ఈమె కూడా ప్రాణాలతో లేదు. ఇదిలా ఉండగా.. కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినప్పటికీ సౌందర్య అచ్చ తెలుగమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.స్టార్ హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలే చేయాలి.. స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలి అనే పద్దతిని ఈమె పూర్తిగా మార్చేసింది.

ఈమె ఎంత స్టార్ డం సంపాదించుకున్నా.. చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇన్సెక్క్యూర్ గా ఫీలయ్యేది కాదు. అందుకే ఈమె గురించి అప్పటి దర్శక నిర్మాతలు చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే 2004 వ సంవత్సరంలో ఈమె ఎవ్వరూ ఊహించని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉండగా.. ఈమె చనిపోయిన రోజున ఈమె అభిమానులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం పార్టీ చేసుకుంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు స్నేహ. ఈమె అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు అయినప్పటికీ స్నేహగానే పాపులర్ అయ్యింది.2001 లో వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ అటు తరువాత ‘హనుమాన్ జంక్షన్’ ‘శ్రీరామదాసు’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘వెంకీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ఉండేది స్నేహ.

కచ్చితంగా ఈమె టాలీవుడ్లో మరో (Soundarya) సౌందర్య అవుతుంది అని అంతా అనుకున్నారు. అందుకే సౌందర్య చనిపోయిన రోజున.. ఈమె పార్టీ చేసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. సౌందర్యకి వెళ్లాల్సిన పాత్రలు ఇక తనకే వస్తాయి అని ఈమె ఆనందంలో పార్టీ చేసుకున్నట్టు అంతా చెప్పుకొచ్చారు. కానీ ‘ఒకరి చావులో ఆనందాన్ని వెతుక్కునే మనిషిని కాదని.. ఎవరో కావాలనే అలాంటి అసత్య ప్రచారానికి పూనుకున్నారంటూ’ స్నేహ ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus