‘ఎదుటివారికి చెప్పేటందుకే నీతులున్నాయి’.. అని ప్రేమ్ నగర్ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు పాడినట్లు ఉంది నేటి హీరోయిన్స్ వ్యవహారం. మాది పద్ధతిగల కుటుంబం.. నేను స్కిన్ షో చేయను… టాలీవుడ్ లో హీరోయిన్స్ కి నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఉండవు.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ని చీప్ గా చూస్తారు.. అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చే బ్యూటీలు.. బాలీవుడ్ అనగానే ఈ నీతులన్నీ హుస్సేన్ సాగర్లో కలిపేస్తున్నారు. హద్దులు మీరి ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు. టాలీవుడ్ యువరాణిగా పేరుతెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇక్కడ స్కిన్ షో చేయడానికి ఆమడ దూరం ఉంటుంది.
కానీ ఓ జాతీయ మ్యాగజైన్ కోసం టాప్ లెస్ గా ఫోటలకు ఫోజులిచ్చి బాలీవుడ్ అవకాశం కావాలని ఇండైరెక్ట్ గా చెప్పింది. తెలుగు పరిశ్రమని, రాఘవేంద్రరావు ని ఆడిపోసుకున్న తాప్సి.. బాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే హాట్ ఫోటో షూట్ చేసింది. ఇలియానా అయితే బాలీవుడ్ లో రెండు సినిమాలో కనిపించగానే బికినీ లో మాత్రమే కనిపించడం మొదలు పెట్టింది. ఇక నిన్న మొన్నటి వరకు తెలుగులో జోరు చూపించిన రకుల్ ప్రీత్ సింగ్ .. నాది మిలిటరీ బ్యాక్ గ్రౌండ్.. బాగా స్ట్రిక్ట్ లాంటి కబుర్లు చెప్పి లేటెస్ట్ ఫోటో షూట్ లో అందాలు ఆరబోసింది. ఇలా బాలీవుడ్ ఛాన్స్ కోసం హీరోయిన్స్ దేనికైనా రెడీ అంటున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.