రవితేజ కొత్త సినిమాలో అతడి పక్కన ఇప్పటి వరకు యాక్ట్ చెయ్యని హీరోయిన్లను ప్రేక్షకులు చూడవచ్చు. కరోనా తరువాత ‘క్రాక్’ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు మాస్ మహారాజ్ రానున్నాడు. అందులో అతడి పక్కన శ్రుతి హాసన్ యాక్ట్ చేసింది. ‘బలుపు’ తరువాత వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా అది. ‘క్రాక్’ పూర్తి చేసి రమేష్ వర్మ డైరెక్షన్ లో కొత్త సినిమా స్టార్ట్ చేయాలని రవితేజ అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఈ జనవరిలో ఆ సినిమా అనౌన్స్ చేశారు.
రమేష్ వర్మ డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో రవితేజ పక్కన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధి అగర్వాల్, అను ఇమ్మాన్యుయేల్ యాక్ట్ చెయ్యనున్నారు. హీరోయిన్లు ఇద్దరికీ రీసెంట్ గా డైరెక్టర్ స్టోరీ నేరేట్ చేశారట. యాక్ట్ చేయడానికి వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ చూపించారని తెలిసింది. స్టోరీ పరంగా రవితేజ పక్కన కొత్త హీరోయిన్లు అయితే బాగుంటుందని డైరెక్టర్ ఫిలింగ్. సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందుకని, ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నారు.నవంబర్ నుండి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని రవితేజ, రమేష్ వర్మ ప్లాన్ చేస్తున్నా రు.
హైదరాబాద్ లో 70 డేస్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. తరువాత ఫారిన్ వెళ్తారట. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్లో సినిమాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్.
Most Recommended Video
బిగ్బాస్లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!