టాలీవుడ్ లో హీరోలుగా అడుగు పెట్టి…జెడ్ సీప్ లో దూసుకుపోతున్న వారు కొందరు అయితే, హీరోయిజం అచ్చిరాక విలన్స్ గా మారిపోతున్న వారు మరికొందరు. అయితే హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలు చేస్తున్నారు కొందరు యువ హీరోలు….ఎవరా హీరోలు…ఏంటి ఆ కధ అంటే…ముందు ఈ కధ చదవాల్సిందే…విషయం ఏమిటంటే, ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త శకం మొదలయింది…యంగ్ విలన్ ల ట్రెండ్ ఊపందుకుంటుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడులో.. ఆది పినిశెట్టి విలన్ రోల్ లో విపరీతంగా ఆకట్టుకున్నాడు…
ఆయన నటనకు ఫిదా అయిపోయిన దర్శక నిర్మాతలు, మరిన్ని సినిమాల్లో విలన్ పాత్రలు ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత… ఒక వారానికే విడుదలయిన నారా రోహిత్ మూవీ రాజా చెయ్యి వేస్తేలో.. నందమూరి కుర్రాడు తారకరత్న విలన్ గా నటించి మెప్పించాడు. అయితే తారకరత్న ఇలా విలన్ రోల్ చేయడం ఇదేమీ మొదటి సారి కాదు, అప్పట్లో ‘అమరావతి’ సినిమాలో నటించి ఆ పాత్రకు నంది సైతం తీసుకున్నాడు. ఇక రాజా చెయ్యి వేస్తేలో ప్రస్తుత ట్రెండ్ లో కరెక్ట్ సెట్ అయిపోయాడు. మరో పక్క టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా.. బాఘీ చిత్రంతో బాలీవుడ్ లో విలన్ గా అరంగేట్రం చేసేశాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాహుబలి భల్లాల దేవుడు…దగ్గుపాటి రాణా పాత్ర మరొక ఎత్తు. బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడిగా రాణా చేసిన పాత్ర… రాణాకు మంచి పేరుతో పాటు, మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. యువ హీరోలే కాకుండా, లెజెండ్ మూవీతో జగపతి బాబు, తని ఒరువన్ తో అరవింద్ స్వామి, రోబో సీక్వెల్ తో అక్షయ్ కుమార్ లు కూడా విలన్స్ గా మారిపోయారు. ఇలా అవకాశాల వేటలో హీరోలు చాలా మంది విలన్స్ గా మారిపోవడం నిజంగా సరికొత్త శకానికి నాంది అనే చెప్పాలి.